
అయితే గత కొద్ది కాలంగా శివ జ్యోతి తల్లి కాబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి . ఈ నేపథ్యంలోనే తాజాగా శివ జ్యోతి దసరా పండుగ సందర్భంగా ఈ విషయంపై స్పందించింది . ఈ మేరకు ఇంస్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది . " అందరికీ దసరా శుభాకాంక్షలు . ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దయతో 2026 లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు . మీరు నాకు కావాల్సిన వాళ్ళు . వాళ్ల సొంత అక్క బావకి బేబీ రావాలి అనంత గట్టిగా కోరుకున్నారు . ఇట్లా బిడ్డ వస్తుంది అని చెప్పగానే మా వాళ్లు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను .
మీరు కూడా అంతే సంతోషంగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను . అందుకే చెబుతున్న పండగ పూట ఈ మాట . ప్లీజ్ దిష్టి పెట్టకండి . ఆశీర్వాద్యులు ఇవ్వండి . దిష్టి కన్నా ఆశీర్వాదాలు గొప్పవని ప్రూవ్ చేసుకుందాం . ఈ అద్భుతమైన ప్రయాణంలో మాకు సపోర్ట్ చేసినోలను సపోర్ట్ గా ఉన్నోళ్లను జీవితాంతం మేము గుర్తు పెట్టుకుంటాము . మేము మీకు ప్రామిస్ చేస్తున్నాము . మీకు మేము ఎప్పటికీ అండగా ఉంటాము. బాధ పెట్టినవాళ్లను కూడా మర్చిపోను . మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను " అంటూ శివ జ్యోతి ఓ వీడియోని షేర్ చేసింది .