మన భారతదేశానికి చెందిన ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్లి సెటిల్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఎక్కువ శాతం మంది మన ఇండియన్స్ అమెరికాలో కూడా సెటిల్ అయ్యారు. అమెరికాలో సెటిల్ అయిన వారికి ప్రస్తుతం అమెరికా దేశం నుండి కాస్త సమస్యలు వస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. దానితో భారతదేశం కూడా అమెరికాలో సెటిల్ అయినా భారతీయులకు మీరు ఇక్కడికే రండి ... మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాం.

మీరు ఇక్కడ కంపెనీలు పెట్టండి. ఇండియాలు బాగా అభివృద్ధి చేద్దాం అనే పిలుపును ఇస్తుంది. దానితో ఎంత మంది ముందుకు వస్తారు అనేది తెలియదు కానీ కేవలం భారతదేశం మాత్రమే కాదు అమెరికాలో సెటిల్ అయ్యి అద్భుతమైన టాలెంట్ ఉన్న వారికి ఇతర దేశాల నుండి కూడా వరుస పెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. అమెరికాలో ఇప్పటికే సెటిల్ అయినా వారిని తమ దేశానికి రండి అని అక్కడ మేము ఉద్యోగ అవకాశాలను ఇతర అవకాశాలను కూడా కల్పిస్తాము అని అనేక దేశాలు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే జర్మనీ అమెరికాలో సెటిల్ అయిన వారు మా దేశానికి రావచ్చు మేము కూడా వారికి అవకాశాలు కల్పిస్తాము అనే పిలుపును ఇచ్చింది.  కెనడా కూడా ఎవరైతే అమెరికాలో సెటిల్ అయినా భారతీయులు అక్కడ ఉండలేక ఇబ్బంది పడుతున్నారో మా దేశానికి వచ్చేయండి మేము వారికి మంచి సదుపాయాలను ఉద్యోగాలను వసతులను కల్పిస్తాము అని పిలుపునిచ్చింది.

ఇక తాజాగా ఈ లిస్టులోకి మరో దేశం చేరిపోయింది. జపాన్ కూడా ఎవరైతే అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ ఉండడానికి ఇబ్బందులు పడుతున్నారో వారు మా దేశానికి వచ్చేయండి వారికి మేము అద్భుతమైన వసతులను కల్పిస్తాం అని పిలుపుని ఇస్తుంది. ఇలా అనేక దేశాలు అమెరికాలో సెటిల్ అయిన భారతీయులను తమ దేశానికి రప్పించేందుకు అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. దీని ద్వారానే అర్థం అవుతుంది భారతీయులకు ఏ రేంజ్ క్రేజ్ ఉంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: