
ఇటీవల దసరా సందర్భంగా వీళ్లిద్దరి నిశ్చితార్ధం అయిపోయిందని ఇన్‌సైడ్ సోర్సులు చెబుతున్నాయి. అంతేకాదు, పరిశ్రమలోని కొంతమంది సన్నిహితులు కూడా ఈ ఇద్దరి మధ్య ప్రేమ నిజమేనని, ఇద్దరి కుటుంబాలు కూడా ఈ సంబంధాన్ని అంగీకరించాయని అంటున్నారు. రీసెంట్‌గా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ – రష్మిక మందన ఫిబ్రవరి లో పెళ్లి పీటలెక్కబోతున్నారని గట్టి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై రష్మిక గానీ, విజయ్ గానీ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో వీళ్ల పెళ్లి పిక్స్, ఫ్యాన్‌మేడ్ వీడియోస్ షేర్ చేస్తూ సంబరాలు జరుపుతున్నారు.
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన టాపిక్ సోషల్ మీడియాలో హాట్‌గా మారింది. అదేంటంటే, మరో యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా త్వరలోనే తన లవ్ లైఫ్‌కి ముగింపు పలకబోతున్నాడట. రీసెంట్‌గా ఆయన తన గర్ల్‌ఫ్రెండ్ నైనికతో గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు, "ఇదే పెళ్లి ముందు ఫేజ్!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైఅర్ల్ అవుతున్న వార్తల ప్రకారం, ఈ ఇద్దరి పెళ్లి కూడా త్వరలోనే జరుగబోతోందని చెబుతున్నారు.ఇలా టాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల పెళ్లి వార్తలు బయటకు రావడంతో, అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొందరు సోషల్ మీడియాలో "ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ మొదలైందా?" అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంట నిజంగానే ప్రేమలో ఉన్నారో, లేక ఇది కేవలం రూమరేనా అన్నది మాత్రం కొద్ది రోజులలోనే తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం — ఈ ఇద్దరి పేర్లు కలిసినప్పుడల్లా సోషల్ మీడియా హీట్ పెరిగిపోతుంది!