రాజమౌళి అంటేనే కొత్తదనం, సాహసం, విజన్‌. ఆయ‌న చేసిన ప్రతి సినిమా ఒక్కో మైలురాయి. ఇప్పుడు ఆయన అదే జోష్‌తో రీ-రిలీజ్‌ రంగంలోనూ కొత్త హంగులు తీసుకురాబోతున్నారు. ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ రెండు భాగాల్నీ కలిపి ‘బాహుబలి ఎపిక్’ పేరుతో ఈ నెల 31న గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ ఊహించని కాన్సెప్ట్‌ ఇది. రీ రిలీజ్ కూడా రాజమౌళి స్టయిల్‌లోనే ఉండబోతోందన్న మాట. ప్రస్తుత కాలంలో రీ రిలీజ్‌లు సాధారణం అయిపోయాయి. కానీ చాలాసార్లు హీరోలకు, దర్శకులకు కూడా తెలియకుండానే సినిమాలు తిరిగి విడుదలవుతున్నాయి. అయితే రాజమౌళి మాత్రం ఈసారి స్వయంగా రంగంలోకి దిగారు.
 

ఇక ఆయన పర్యవేక్షణలోనే ‘బాహుబలి ఎపిక్’ ఎడిటింగ్ పూర్తయింది. అంతేకాదు, ఇందులో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని కొత్త సీన్లు కూడా జోడించారట. అవే ఫ్యాన్స్‌కి పెద్ద ట్రీట్‌ అవుతాయనడంలో సందేహం లేదు. ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు పేలుస్తున్నారు. మరి ఈ రీ రిలీజ్‌కి రాజమౌళి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చూడండి - కొత్త సినిమా రిలీజ్‌లా పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. భారీ ప్రోమోషన్ క్యాంపెయిన్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రభాస్‌తో స్పెషల్ ఇంటరాక్షన్ - ఇవన్నీ జరుగబోతున్నాయట. ఆ ఈవెంట్‌లోనే ‘బాహుబలి 3’ ప్రకటన ఉండొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి కట్టప్ప బ్యాక్‌స్టోరీ మీద ఓ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్‌.

 

ఆ సినిమాతో బాహుబలి యూనివర్స్‌కి కొత్త చాప్టర్‌ మొదలవుతుందట. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ‘బాహుబలి ఎపిక్’ రీ రిలీజ్ మార్కెట్‌ను పూర్తిగా షేక్ చేయబోతుంది. ఇప్పటి వరకూ రీ రిలీజ్ సినిమాలు సాధించని రికార్డులు ఇది బ్రేక్ చేయవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా పాన్‌ ఇండియా లెవెల్‌లో అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కావడం మరో మైలురాయి కానుంది. ఈ ప్రాజెక్ట్‌ సక్సెస్ అయితే, ‘పుష్ప ఎపిక్’, ‘కేజీఎఫ్ ఎపిక్’, ‘కాంతార ఎపిక్’ వంటి ప్రాజెక్టులు కూడా అదే తరహాలో రావడం ఖాయం. మొత్తానికి రాజమౌళి మరోసారి చూపించబోతున్నారు — సినిమా మాంత్రికత రీ రిలీజ్‌ల్లో కూడా పనిచేస్తుందని! “సినిమా అంటే విజన్… రీ రిలీజ్ అంటే రాజమౌళి స్టైల్!”

మరింత సమాచారం తెలుసుకోండి: