
ప్రమాదం జరిగిన తర్వాత కూడా తాను వర్కౌట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చేసానని తెలియజేశారు. నాకు కొద్దిగా తలనొప్పి ఉంది! కానీ ఒక బిరియాని తిని నిద్రపోతే సరిపోతుందని అభిమానులందరికీ కూడా నా బిగ్గెస్ట్ హగ్స్, ప్రేమ అంటూ ఈ వార్త మిమ్మల్ని బాధ కలిగించకూడదంటూ రాసుకు వచ్చారు.. అయితే ఈ కారు సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవల్లి సమీపంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తన మేనేజర్ రవికాంత్ యాదవ్ తో పాటుగా డ్రైవర్ తో కలిసి నిన్నటి రోజున ఉదయం పుట్టపర్తికి వెళ్ళారు.
అలా హైదరాబాదుకు తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు వరసిద్ధి పత్తిమిల్లు దగ్గరికి రాగానే ప్రయాణిస్తున్న బస్ సడన్గా బ్రేక్ వేయడంతో విజయ్ దేవరకొండ ముందు ఉన్న బోలోరో ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్న ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. విజయ్ దేవరకొండ కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్వయంగా ప్రకటించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రౌడీ జనార్ధన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో కీలకమైన పాత్రలో అలనాటి హీరో రాజశేఖర్ నటించిన బోతున్నట్లు సమాచారం.