
కానీ ఒక సినిమా బాగుందా లేదో తెలిసేది ప్రేక్షకుల మౌత్ టాక్ తోనే . థియేటర్ నుంచి బయటికి వచ్చినవారు యూట్యూబ్ రివ్యూలను మరియు తమ స్నేహితులకు నిజాయితీగా చెబుతూ ఉంటారు . కాబట్టి ఎలాంటి సెల్ఫ్ బుకింగ్స్ తో ప్రజలను మోసం చేయడం వృధా అని చెప్పుకోవచ్చు . అయితే ఇదే విషయంపై బాలీవుడ్ ఆగ్రా దర్శకుడు మరియు నిర్మాత కరణ్ జోహార్ కూడా బహిరంగంగా వెల్లడించాడు .
కరణ్ జోహార్ మాట్లాడుతూ.. " కార్పొరేట్ బుకింగ్స్ మరియు సెల్ఫ్ బుకింగ్స్ అనేవి ఇండస్ట్రీలో ఉన్న చెత్త పద్ధతులు . వీటిలో సినిమా హిట్ కాదని తాత్కాలికంగా టికెట్ సేల్స్ పెరిగిన అవి సినిమాకు నష్టం లో పడేస్తాయి. నిర్మాతలు తమ సొంత డబ్బు పెట్టి టికెట్ కొనడం వృధా . ఇలా చేయడం వల్ల పరిశ్రమ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది " అని ఆయన వెల్లడించడం జరిగింది . ఒక మూవీ విజయవంతం కావాలంటే కంటెంట్ బాగుండాలి . బాగోలేకపోతే ఏ విధంగా ప్రయత్నించినా ఆ మూవీ నిజమైన రివ్యూ ప్రేక్షకుల్లోకి వచ్చేస్తుంది . ఇలా చేయడం వలన నిర్మాతలకు డబ్బు నష్టం తప్ప ఇంకొకటి ఉండదని చెప్పుకోవచ్చు .