
అయితే కర్ణాటకలో ఈ చిత్రం హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు . కర్ణాటకలో ఇటీవల చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఆక్యుపెన్సీ లేక మూసి వేశారు . కన్నడలో స్టార్ హీరోలు సినిమాలు ఏవి లేకపోవడం ఉన్న సినిమాలు అంతగా రెవెన్యూ రాకపోవడంతో అక్కడ పనిచేసే స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేక కొద్దీ నెలలుగా కొన్ని థియేటర్స్ మూసి వేశారు . కానీ ఇప్పుడు ఆ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి . దీనికి కారణం కాంతారా చాప్టర్ 1 .
మారుమూల పల్లెటూరులో కూడా మూత పడిన థియేటర్స్ ను కూడా కాంతారా చాప్టర్ 1 కోసం తిరిగి ఓపెన్ చేయడం జరిగింది . రిలీజ్ రోజు నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ కలెక్షన్స్ తెచ్చి పెడుతుంది ఈ మూవీ. మరో ఏడాది పాటు డియర్ సిస్టర్స్ ను రన్ చేసేలా ఊరట నిలిచింది ఈ మూవీ . దసరా సెలవలు ముగిసినప్పటికీ కూడా నేడు కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ఏడు కోట్ల మార్క్ అందుకునే సాలిడ్ గా దూసుకుపోతుంది . ఫస్ట్ వీకెండ్ నాటికి కర్ణాటకలో ఈ మూవీ 80 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది .