
అంతేకాకుండా ఆమెను అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు జైల్లో కూడా పెట్టారు . ఈ సమయంలో బెయిల్ మీద బయటకు వచ్చి ఈ కేసు విచారణలో భాగంగా తప్పులేదని తెలపడంతో ఈ గండం నుంచి బయటపడింది హేమ . ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు వీడియోలు షేర్ చేస్తుంది . తన తప్పు లేకున్నా తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది కూడా . ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది .
హేమ మాట్లాడుతూ.. " కరోనా సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా . ఆ ప్రభావం నామీద ఉండగానే గత ఏడాది నా తప్పు లేకున్నా నన్ను నిందించడంతో మరింత కృంగిపోయాను . డిప్రెషన్ ప్రభావం మరింత పెరగడం జరిగింది . ఈ డిప్రెషన్ కారణంగా నాకు ఎవరినైనా చంపేయాలని లేదా నేనైనా చచ్చిపోవాలనే ఆలోచనలు వచ్చాయి . ఇలాంటి సమయంలో ఆలోచనల నుంచి నన్ను నేను సమర్థించుకున్నాను . ఆవేశం కంటే ఓపిక ముఖ్యమని గ్రహించి మెల్లగా మామూలు మనిషిని అయ్యాను " అంటూ వెల్లడించింది హేమ .