రుక్మిణి వసంత్‌.. ఈ పేరు మొదట్లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ వన్ సినిమా తర్వాత ఆమె పేరు ఒక్క కన్నడలోనే కాదు, మొత్తం దక్షిణాది సినీ పరిశ్రమలో మారుమ్రోగిపోతోంది. రిషబ్ శెట్టి పక్కన హీరోయిన్‌గా నటించిన ఆమె ఆ పాత్రలో చూపించిన నటన, ఎక్స్‌ప్రెషన్స్, మరియు సహజమైన డైలాగ్ డెలివరీకి సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో ఆమె తెరపై కనిపించిన ప్రతి సీన్ ప్రేక్షకుల మదిలో గాఢమైన ముద్ర వేసింది. కాంతార విజయంతో రుక్మిణి వసంత్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌ల జాబితాలోకి ఎగబాకింది. ఆమె నటనలో ఉన్న నిజాయితీ, కళాత్మకతను చూసి ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. సినీ విశ్లేషకులు కూడా ఆమెను "నేషనల్ లెవల్ క్రేజ్ ఉన్న న్యాచురల్ యాక్ట్రెస్"గా అభివర్ణించారు.


ఇప్పటికే రుక్మిణి వసంత్ కెరీర్ స్పీడ్ మరింత పెరిగింది. ఆమె ఇప్పుడు డ్రాగన్ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుందని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని సమాచారం. రెండు ఇండస్ట్రీల టాప్ స్టార్‌లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం అంటే ఎంత పెద్ద అవకాశమో సినీ ప్రపంచానికి బాగా తెలుసు. అంతేకాదు, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించబోయే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో కూడా రుక్మిణి వసంత్‌కు ఛాన్స్ దక్కిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్‌కి ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్ క్రియేట్ అయింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, రుక్మిణి వసంత్ కెరీర్ మరింత ఎత్తుకు చేరడం ఖాయం.



సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులలో ముందే భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఎంపిక కావడం ఆమె అదృష్టంలో మరో మైలురాయిగా చెప్పాలి. ఈ అవకాశం ఆమెకు దక్కితే, టాలీవుడ్‌లో కొత్త స్టార్ హీరోయిన్‌గా అవతరించడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్‌లో కూడా రుక్మిణి వసంత్ స్థానం పటిష్టం అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల మాటల్లో చెప్పాలంటే, రుక్మిణి వసంత్ ఇప్పుడు “రైజింగ్ స్టార్ ఆఫ్ సౌత్”గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతీ సినిమాలో నటనతో పాటు పాత్రలో జీవించడం ఆమె ప్రత్యేకతగా మారింది. ప్రస్తుతం రుక్మిణి వసంత్ షెడ్యూల్ బిజీగా ఉండగా, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూలో నిలబడుతున్నారు.



ఏదేమైనా, రుక్మిణి వసంత్ కెరీర్ ఇప్పుడు టర్నింగ్ పాయింట్‌ దశలో ఉంది. కాంతార వంటి క్లాసిక్ సినిమా తర్వాత ఆమె ఎంచుకున్న ప్రాజెక్టులు ఒకదాని కంటే ఒకటి హైపర్ లెవెల్‌లో ఉన్నాయి. ఒకవేళ రామ్ చరణ్సుకుమార్ సినిమా అధికారికంగా ఫైనలైతే ఇక ఆమె వెనక్కి తిరిగి చూడమన్నా చూసే అవకాశం ఉండదు. ఇండస్ట్రీలో రుక్మిణి వసంత్ పేరు మరో నేషనల్ లెవెల్ స్టార్ హీరోయిన్‌ల జాబితాలో స్థిరపడటం ఖాయం అని చెప్పవచ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: