సోషల్ మీడియా యుగంలో నిజం – అబద్ధం తేడా తెలుసుకోవడం చాలా కష్టం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ వార్త నిజం, ఏ వార్త అబద్ధం అనే తేడా తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. “ఇది నిజమే” అనుకునేలోపే, అది ఫేక్ అంటూ క్లారిటీ ఇస్తారు. “ఇది ఫేక్” అనుకుంటే, కొంతమంది స్టార్ సెలబ్రిటీలు స్వయంగా స్పందించి “ఇది నిజమే” అని ప్రకటిస్తారు. అలాంటి సంఘటనలు మనం ఇప్పటికే ఎన్నో చూశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది — 80వ దశకానికి చెందిన హీరో, హీరోయిన్లు అందరూ ఒకచోట కలిసి చేసిన రీయూనియన్ వేడుక. ఈ రీయూనియన్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సురేష్ కుమార్, రమ్యకృష్ణ, రాధా, మీనా, తమిళ నటులు ప్రభు, భానుచందర్, జయరామ్ వంటి వారు పాల్గొన్నారు. హిందీ వాళ్లు కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.


ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రీయూనియన్ వేడుక ఎంతో ఉత్సాహంగా జరిగింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ —“నా ప్రియమైన మిత్రులతో కలిసి ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ రీయూనియన్ నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఎన్నిసార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా అనిపిస్తుంది” అని ఎమోషనల్‌గా, సరదాగా రాశారు.అయితే ఈసారి రీయూనియన్ పార్టీలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఆయన ప్రతి సంవత్సరం పాల్గొంటారు, కానీ ఈసారి మిస్ అయ్యారు. అలాగే సీనియర్ హీరో సుమన్ కూడా హాజరుకాలేదు.



ముఖ్యంగా అక్కినేని నాగార్జున మరియు నందమూరి బాలకృష్ణ కూడా ఈ రీయూనియన్‌కు రాకపోవడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరూ 80వ దశకానికి చెందిన హీరోలే కదా, మరి ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. కొంతమంది “ఇటీవల బాలయ్య, చిరంజీవి మధ్య మాటల యుద్ధం జరిగినందువల్లే ఆయన దూరంగా ఉన్నారు” అని అంటుంటే, మరికొంతమంది “నాగార్జున షూటింగ్ షెడ్యూల్స్ వల్ల రాలేకపోయారు” అని చెబుతున్నారు. ఇంకొందరు “బాలయ్యను అసలు ఇన్ వైట్ చేయలేదు” అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.



ఇక కొంతమంది మాత్రం — “వీళ్ళందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, సోషల్ మీడియాలో అభిమానులే అనవసరంగా గొడవ పడుతున్నారు. వీళ్ళు అందరూ బాగానే ఉన్నారు. పర్సనల్ పనుల కారణంగా హాజరుకాలేకపోయి ఉంటారు” అంటూ క్లారిటీ ఇస్తున్నారు.
అయితే మరికొందరు చెబుతున్నదేమిటంటే — “మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన ఈ రీయూనియన్ పార్టీకి, తెలుగు ఇండస్ట్రీలోని ఒక టాప్ ఫ్యామిలీ హీరో ‘వెళ్లొద్దు’ అని ప్రత్యేకంగా నాగార్జున, బాలయ్యలకు చెప్పిందట” అని మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చెప్పాలంటే, ఆయా హీరోలు స్వయంగా స్పందించాల్సిందే అని సినీ ప్రముఖులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: