
ప్రభుత్వంలో పాత్రగా ఉంటూనే ,పార్టీని బలపరచడం, అలాగే ప్రజా సంబంధాలు కలిగి ఉండేలా చూడడం. ప్రజా సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. జనసేన పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేలా చూస్తున్నారు. రెండవది పార్టీని బలపరచడం ఎన్నికలకు క్యాడర్ బూతు స్థాయి నుంచి పార్టీలో చైతన్యం నింపేలా ఫోకస్ చేస్తున్నారు. మూడవది అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు మరింత దగ్గర అయ్యే విధంగా అటు నేతలను పవన్ కళ్యాణ్ కూడా వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వారి యొక్క నియోజకవర్గాలలో రాష్ట్ర పర్యటనలు చేయడమే కాకుండా, అన్ని నియోజకవర్గాలలోని సమస్యలను తెలుసుకొని వాటిపైన స్పందించే విధంగా చూస్తున్నారు.
అలాగే జనసేన పార్టీలో ఉండే అసంతృప్తిని తొలగించేలా, ప్రభుత్వం నిర్ణయాల పైన జనసేన పార్టీ తరపున గ్యారెంటీ ఇవ్వడం, కూటమిగా ముందుకు వెళ్లడం, వచ్చే ఎన్నికలకు సీట్ల పెంపు విషయంపై నిర్ణయాలు తీసుకోవడం వంటివి జనసేన పార్టీ ప్రధాన అంశాల పైన ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. జనసేన పార్టీ తీసుకున్న ఈ త్రిశూల వ్యూహం సరైన రీతిలో అమలు అయితే మాత్రం కూటమిలో భాగంగానే కాకుండా రాబోయే భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ ఒక శక్తిగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒక వైపు ప్రజలతో అనుసంధానం కొనసాగిస్తూ.. ఈ త్రిశూల వ్యూహాన్ని అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందో చూడాలి.