సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఏ విషయానికైనా పెద్ద పెద్ద రాధాంతం జరుగుతోంది. చిన్న విషయాన్నికూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి – 80’స్ యూనియన్ పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలే మెగా స్టార్ అంటే పడని వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్ళకి ఇది పెద్ద స్టాఫ్ లా మారిపోయింది. మన అందరికి తెలిసిందే ఇటీవల చిరంజీవిబాలకృష్ణ మధ్య జరుగుతున్న విభేదాలు. అసెంబ్లీ లో బాలయ్య చేసిన వ్యాఖ్యల వల్ల మెగా ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు.  అందుకే ఆయన తప్పక చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ బాలయ్య మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.


అలాంటి సెన్సిటివ్ టైంలో జరిగిన 80’స్ యూనియన్ పార్టీకి బాలయ్య హాజరుకాకపోవడం ఫ్యాన్స్‌లో మరింత చర్చకు దారితీసింది. దీనికి కావాలనే పెద్ద సీన్ గా మార్చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. కొందరు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాలేదని చెబుతుండగా, మరికొందరు చిరంజీవి ఆయనను ఆహ్వానించలేదని అంటున్నారు. ఈ వాదనలతో సోషల్ మీడియా మొత్తం కాస్త వేడెక్కిపోయింది.“నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది” అంటూ మెగా ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. చిరంజీవి పిలిచినా బాలయ్య రాలేదా? లేక పర్సనల్ రీజన్స్ వల్ల రాలేదా? లేక ఇంకేదైనా ఇష్యూ ఉందా? — అనే అనుమానాలు అంతా వ్యక్తం చేస్తున్నారు.



సోషల్ మీడియాలో ఈ విషయాన్ని కొందరు బాగా సీరియస్‌గా తీసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి, ఇద్దరు లెజెండ్స్ మధ్య చిన్న అపార్థం పెద్ద చర్చగా మారిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ ఈ విషయంపై స్పష్టత ఇస్తేనే ఫ్యాన్స్‌కి క్లారిటీ వస్తుంది. అప్పుడైనా ఈ హీట్ తగ్గుతుందేమో చూడాలి మరి. కాగా చిరంజీవి మాత్రం సినిమాల పనులు ఎక్కడ ఆపడం లేదు అది ఫంక్షన్ అయినా మరొకటి అయినా సినిమా షూటింగ్ కి మాత్రం సరిగ్గ టైం కి అటేండ్ అవుతూ చక్కగా తన పని తాను చేసుకునిపోతున్నారు. బాలయ్య కూడా అఖండ 2 షూట్ ని సరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: