
సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” టాక్‌షోలో పాల్గొన్న నాగ చైతన్య, తన ప్రేమ కథ గురించి ఓ చిన్న సీక్రెట్‌ను షేర్ చేశాడు. ఆయన మాట్లాడుతూ, తాను చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా నటి శోభిత ధూళిపాళతో పరిచయం ప్రారంభమైందని వెల్లడించాడు. ఆ పోస్ట్‌కు శోభిత స్పందించగా, అక్కడినుంచి వారిద్దరి మధ్య సంభాషణ మొదలై, క్రమంగా ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలిపాడు. నాగ చైతన్య ఇలా తన లవ్ స్టోరీని సింపుల్‌గా కానీ హృదయపూర్వకంగా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ జంటపై శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
చైతన్య రివీల్ చేసిన ఈ లవ్ జర్నీ వివరాలు ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక వర్క్ ఫ్రంట్‌లో, నాగ చైతన్య ప్రస్తుతం “విరూపాక్ష” దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. “తండేల్” విజయంతో మళ్లీ పుంజుకున్న చైతు, ఈ కొత్త థ్రిల్లర్‌తో తన కెరీర్‌లో మరో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు