తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ , లోక నాయకుడు కమల్ హాసన్ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ సినీ ప్రస్తానాన్ని మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు వీరు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమలో నటుడి గా , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు.

ఈయన ఇప్పటివరకు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి , కొన్ని సినిమాలలో నటించి , నటుడి గా , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కోలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి రజనీ కాంత్ , కమల్ హాసన్ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ ని రూపొందించబోతున్నట్లు , ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలో రానున్నట్లు ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది.

తాజాగా ఈ విషయం పై ప్రదీప్ రంగనాథన్ ఓపెన్ అయ్యారు. తాజాగా ఈయన తాను రజనీ కాంత్ , కమల్ హాసన్ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు అని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు , ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వాటిని పూర్తి చేశాక ఇతర సినిమాలపై కాన్సన్ట్రేషన్ పెట్టనున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రదీప్ రంగనాథన్ కొంత కాలం క్రితమే డ్రాగన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: