తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ధనుష్ ఒకరు. ధనుష్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా అందుకున్నాయి. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇప్పటికే ఈయన సార్ , కుబేర అనే రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.

ఈ రెండు మూవీలతో కూడా ఈయన మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇలా తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి విజయాలను అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ధనుష్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తాజాగా ధనుష్ "ఇడ్లీ కడాయ్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమాను ఇడ్లీ కొట్టు అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టీ టీ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు అత్యంత భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... నెట్ ఫ్లిక్స్  సంస్థ వారు ఇడ్లీ కడాయ్ మూవీ యొక్క ఓ టి టి హక్కులను 45 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇలా ఇడ్లీ కడాయ్ మూవీ కి ఓ టి టి డీల్ ద్వారా ఆయన పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: