
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య స్నేహం గురించి చెప్పాల్సిన పని లేదు. రిషబ్ శెట్టి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన తనకు సోదరుడితో సమానం అని రిషబ్ శెట్టి తెలిపారు. అంతేకాక, తారక్ తమ కుందాపుర అబ్బాయిలానే కనిపిస్తారని రిషబ్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అందించే సహకారాన్ని తాను అస్సలు మరిచిపోలేనని పేర్కొన్నారు. తాము సృష్టించిన 'కాంతార' ప్రపంచాన్ని చూసి తారక్ ఆశ్చర్యపోయారని రిషబ్ వెల్లడించారు.
ఇక, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో తాను నటిస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని రిషబ్ స్పష్టం చేశారు. అయితే, తాను 'జై హనుమాన్' సినిమాలో నటిస్తున్నానని, ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలుకానుందని తెలిపారు.
తన డైరెక్షన్‌లో సినిమా రావడానికి రెండేళ్లు పట్టొచ్చని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఏ సినిమా చేస్తాననేది ఇప్పుడే చెప్పలేనని, నటుడిగా ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. అయితే, డైరెక్షన్ కే తన ఫస్ట్ ప్రియారిటీ అని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు. 'జై హనుమాన్' ప్రయాణంలో పూర్తిస్థాయిలో తెలుగు నేర్చుకుంటానని, ఇది తనకు ఒక గొప్ప అవకాశం అని రిషబ్ శెట్టి వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ అందించే సహకారాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని రిషబ్ శెట్టి మరోసారి స్పష్టం చేశారు. కన్నడలో తమకు దక్కిన ప్రేమాభిమానాలతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా తమ 'కాంతార'ను ఆదరించడం వెనుక తారక్ చేసిన అద్భుతమైన సహాయం ఉందని రిషబ్ తెలిపారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు