ప్రభాస్ — ఈ పేరు వినగానే ఫ్యాన్స్ కళ్ల ముందు కనబడేది ఆరడుగుల కటౌట్. ఆ కటౌట్ చూసి ఫ్యాన్స్ చేసే హడావుడి, ఆ ఉత్సాహం, ఆ క్రేజ్‌ అన్నీ వేరే రేంజ్‌లో ఉంటాయి. ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్, ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న "స్పిరిట్" సినిమా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఊహించలేనంత హైప్ ఉంది. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే “అర్జున్ రెడ్డి”, “కబీర్ సింగ్”, “అనిమల్” వంటి సినిమాలతో తనదైన మాస్, ఎమోషనల్ డైరెక్షన్ చూపించిన సందీప్ — ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా "స్పిరిట్" ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఎంత ఉన్నా, అంతే స్థాయిలో కాంట్రవర్సీలు కూడా చుట్టుముట్టాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పడుకోనేను ఎంపిక చేసినట్లు సమాచారం. కానీ కొన్ని అంతర్గత కారణాల వల్ల ఆమెను ప్రాజెక్ట్ నుండి తప్పించినట్టు టాక్ వచ్చింది. దీని మీద కోపంతో దీపికా పదుకొనే పిఆర్ టీమ్ ఈ సినిమా సంబంధించిన కొన్ని ముఖ్యమైన డిటైల్స్, సీన్స్ సోషల్ మీడియాలో లీక్ చేశారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి.


ఇది తెలిసిన వెంటనే సందీప్ రెడ్డి వంగా ఏం చేశాడు అనేది కూడా అందరికి తెలుసు. అంతేకాదు, ఆ విషయం మీద ఆయన పరోక్షంగా స్పందించినట్లు కూడా ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రీసెంట్‌గా దీపికా నటించాల్సిన మరో సినిమా “కల్కి 2” నుంచి ఆమెను తీసేస్తున్నామని మేకర్స్ ప్రకటించగానే, సందీప్ రెడ్డి వంగా చేసిన రియాక్షన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సందీప్ రెడ్డి వంగా వర్సెస్ దీపికా పదుకొనే అనే టాపిక్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.ఇంతలో “స్పిరిట్” షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో ప్రతి సినిమాలో కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం డూప్‌లను ఉపయోగించాడు. కానీ ఈసారి మాత్రం అలా కాదు! “స్పిరిట్”లో ఆయన ఏ ఒక్క యాక్షన్ సీన్‌కీ డూప్ లేకుండా స్వయంగా యాక్ట్ చేయబోతున్నాడు.



ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. కథలో గన్ ఫైట్, చేజింగ్ సీక్వెన్స్‌లు, హ్యాండ్ టు హ్యాండ్ యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అందుకోసం ప్రభాస్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారని, గన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారని సమాచారం. యూనిట్ సోర్సుల ప్రకారం, ప్రభాస్ స్పెషల్ యాక్షన్ సెషన్స్‌లో పాల్గొంటూ ప్రతి షాట్‌ను స్వయంగా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఆయన డెడికేషన్ చూసి టీమ్ అందరూ ఆశ్చర్యపోయారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో “ప్రభాస్ డూప్ లేకుండా యాక్షన్ చేస్తున్నాడు” అనే న్యూస్ క్షణాల్లో వైరల్ అయ్యింది.



ఇక ప్రభాస్సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్‌కు ఒక ప్రత్యేకమైన ఉత్సాహం. ఒకవైపు సందీప్ స్టైల్‌లో ఉండే రా ఎమోషన్, మరోవైపు ప్రభాస్ యొక్క పవర్‌ఫుల్ ప్రెజెన్స్ – ఈ కలయికతో “స్పిరిట్” సినిమా రికార్డులు బద్దలుకొట్టేలా కనిపిస్తోంది.సినిమా షూట్ వేగంగా జరుగుతున్నప్పటికీ, రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: