
ప్రస్తుతం విడుదలైన అప్డేట్స్ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుంది అని చెప్పేయచ్చు. మహేష్ పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ .. వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సినిమా నవంబర్ 28న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన టీజర్ సినిమా పై హైప్స్ పెంచేసింది. టోటల్ ఎంటర్టైన్మెంట్ పైన ఆధారపడి రూపొందించబడింది ఈ సినిమా అంటూ తెలుస్తుంది.
రామ్ పోతినేని ఆకట్టుకునే పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ అందాల క్యూట్ నాటీ స్టైల్, చమత్కారమైన డైలాగ్స్ ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.ఈ సినిమాలో రామ్ పోతినేని ఒక సూపర్‌స్టార్‌కి వీరాభిమానిగా కనిపిస్తారు. కన్నడ స్టార్ ఉపేంద్ర గారి పోషించిన ఆంధ్ర కింగ్ పాత్రకు రామ్ ఎంతగానో అనుకూలంగా నటించారని టీజర్ స్పష్టంగా చూపిస్తోంది. రామ్ పోతినేని ఎనర్జీ ఫుల్ మాస్ డైలాగ్స్ తో, భాగ్యశ్రీ క్యూట్ పర్ఫార్మెన్స్ తో ఈ టీజర్ లో ఆకర్షణగా నిలిచారు. అదేవిధంగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖులు ముఖ్యపాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. ప్రస్తుతం టీజర్ సోషల్ మీడియాలో పెద్ద వసూళ్లు సృష్టిస్తోంది. ఫ్యాన్స్ ఉత్సాహంగా, రామ్ పోతినేని ఈ సినిమాతో బిగ్ హిట్ సాధించబోతున్నాడని ధీమాగా చెప్పుతున్నారు. మరి ఎందుకు లేట్ ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి..!!