దగ్గుబాటి రానా తండ్రి కాబోతున్నాడని ఇప్పటికే ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటివరకు అయితే అది జరిగింది లేదు.కానీ ఇప్పుడు మాత్రం వీడియోతో సహా బయటపడింది.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మిహికా బజాజ్ బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపించింది.. మరి మిహికా బజాజ్ నిజంగానే తల్లి కాబోతుందా..రానా దగ్గుబాటి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా.. మిహికా బజాజ్ ప్రెగ్నెంట్ వార్తల్లో ఉన్న నిజం ఎంత..ఆ వీడియోలో ఏముంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ శివానీల పెళ్లి జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ పెళ్లికి అన్ని దగ్గరుండి చూసుకున్నారు ఎన్టీఆర్,లక్ష్మీ ప్రణతి.. ఇక నితిన్ పెళ్లికి ఇండస్ట్రీ నుండి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే నితిన్ పెళ్లి చేసుకున్న శివానికి దగ్గుబాటి ఫ్యామిలీ దగ్గరి చుట్టాలని తెలుస్తోంది. 

అందుకే నితిన్ శివానీల పెళ్లికి దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం తరలివచ్చింది. అలా వెంకటేష్,నీరజ,సురేష్ బాబు,రానా, మిహికా, నాగచైతన్య,దగ్గుబాటి అభిరామ్, నాగచైతన్య తల్లి లక్ష్మీ ఇలా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లిలో వాలి పోయారు. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ ఎన్టీఆర్ బావమరిది పెళ్లికి వచ్చి హడావిడి చేసిన వీడియోలు,ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా ఒక వీడియోలో రానా భార్య మిహికా బజాజ్ కి సంబంధించిన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక నార్నె నితిన్ శివానీల పెళ్లికి మిహికా బజాజ్ బ్లూ కలర్ సారీ కట్టుకొని వచ్చింది. అయితే ఆ సారీలో రానా తో కలిసి నడుచుకుంటూ వస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో మిహికా బజాజ్ బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అయితే బయటకి బేబీ బంప్ కనిపించకూడదని మిహికా సారీ మీద నుండి శారీ కలర్ లో ఉండే బ్లూ కలర్ జాకెట్ లాంటిది స్టైల్ చేసింది.కానీ మిహికా బజాజ్ అలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఆమె బేబీ బంప్ మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు రానా మిహికా ఇద్దరూ పేరెంట్స్ కాబోతున్నారు.. ఇది రూమర్ కాదు ఈ వీడియోనే ప్రూఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు రానా తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయట పెట్టలేదు. బహుశా బేబీ పుట్టక బయట పెడతారేమో.. ఇక రానా కంటే వెనక పెళ్లి చేసుకున్న అభిరామ్ కి ఇప్పటికే ఓ పాప కూడా పుట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: