
ఇలాంటి సమయంలో ఇప్పుడు కొరటాల శివ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కారణం ఆయన ఇచ్చిన జీవిత సలహా. కొరటాల శివ తాజాగా యువ హీరో సిద్దు జొన్నలగడ్డకు ఒక విలువైన సలహా ఇచ్చారు. ఈ విషయాని ఆయనే వివరించారు. "సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ అనే సినిమా పెద్ద ఎత్తున డిజాస్టర్ అయింది. ఆ షాక్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో కొరటాల శివ అతనికి ఓ సలహా చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
కొరటాల శివ సిద్ధు కి కాల్ చేసి మాట్లాడుతూ“ ఆకాశమంత హిట్లు చూశాక, భూమి మీద పడిపోయే ఫ్లాపులు కూడా చూశాక. ఇక చూడదానికి ఏం ఉంది..?" అంటూ ఆయనను మొటివేట్ చేశారట. ఆకాశ లెవల్ హిట్ వచ్చిందంటే నేల మీదే ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే హిట్, ఫ్లాప్ రెండూ మన జీవితానికి భాగమే. ఒక్క ఫ్లాప్‌తో ఏమీ పోదు, కానీ ఆ ఫ్లాప్ నీకు గుణపాఠం నేర్పుతుంది” అని సిద్దుతో చెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మరో మాట కూడా అన్నారట — “సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ తప్ప ఇంకేమీ లేదు. హిట్ దక్కితే అందరూ నీతో ఉంటారు, ఫ్లాప్ అయితే ఒంటరివవుతావు. కానీ ఆ ఒంటరితనం నీకు బలం ఇస్తుంది. ఆ దశను దాటితే మళ్లీ కొత్త ఆరంభం ఖాయం” అని కొరటాల సలహా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, కొరటాల ఈ సలహా తన స్వీయ అనుభవంతో కూడినదే అంటున్నారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి భారీ హిట్లు చూసిన ఆయన, ‘ఆచార్య’ ఫ్లాప్‌తో కిందకు పడిపోయాడు. ఆ అనుభవం ఆయనకు చాలా విషయాలు నేర్పిందని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ అనుభవాన్ని సిద్దుతో పంచుకోవడం ఆయనకు కూడా రిలీఫ్‌లా అనిపించిందని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. కొరటాల శివ ఇచ్చిన ఈ సలహా — కేవలం సిద్దు జొన్నలగడ్డకే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యువ నటులకు కూడా ఒక లైఫ్ లెసన్‌గా మారిందనే కామెంట్లు వస్తున్నాయి.