యంగ్ హీరోయిన్ అనుపమ ఈసారి మాత్రం చాలా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తోంది.ఈ ఏడాది వరుసగా నాలుగు చిత్రాలతో సందడి చేసింది. ఇందులో ఒకటి డ్రాగన్, మరొకటి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, మరొకటి పరదా, మరొకటి కిస్కింధపురి. ఇప్పుడు బైసన్ అనే చిత్రంలో నటించిన అనుపమ ఈ సినిమా త్వరలోనే రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలు తనకు కేవలం కెరియర్ మాత్రమే కాదని, తనకు వ్యక్తిగత వ్యసనంగా మారిపోయానని తెలియజేసింది అనుపమ.


తన మొదటి సినిమా ప్రేమమ్ చేసినప్పుడు సినిమా కేవలం ఒక మాధ్యమం మాత్రమే కాదు ఒక మాయాజాలం వంటిదని గ్రహించాను, అప్పటి నుంచి సినిమా గురించి ఎక్కువగా తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఆ ఉత్సాహంతోనే ప్రతి సినిమాలలో కూడా నటించానని తెలియజేసింది. తర్వాతి అనుభవాల వల్ల కొన్ని చిత్రాలలో కొన్ని సన్నివేశాలలో నటించలేకపోయానని తెలిపింది. ముఖ్యంగా మారి వంటి డైరెక్టర్ తో పని చేసే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను.. కానీ బైసన్ సినిమాతో తనకు అదృష్టం కలిసొచ్చిందని తెలిపింది అనుపమ.


10 సంవత్సరాల క్రితం ఫోటోషూట్ సమయంలో పొందిన అనుభూతి ఇప్పుడు మళ్లీ తన మనసులో కలిగిందంటూ తెలియజేసింది. అనుపమ కి సినిమాలు అంటే కేవలం వృత్తి మాత్రమే కాదని, తన వ్యక్తిగత ప్రేరణ అంటూ తెలియజేసింది అలాగే ప్రతి సినిమా కూడా తనకి ఒక సవాల్ అని, జీవన విధానంలో భాగంగా మారిపోయాయంటూ తెలిపింది. ప్రతి కొత్త ప్రాజెక్టుతో అభిమానులను మెప్పించాలనే తపన ఉందని, వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి చెందడానికి  దారితీస్తుందని తెలియజేసింది. సినిమాలు అంటే కేవలం నటన మాత్రమే కాదు. బాగోద్వేగ, సృజనాత్మక ప్రయాణం అంటూ తెలియజేసింది. ఆ అనుభూతి ,ఆ ప్రేమే ప్రతి సినిమాలో కూడా మరింత కృషి చేసేలా చేస్తుందని తెలియజేసింది అనుపమ..

మరింత సమాచారం తెలుసుకోండి: