ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒక హీరో కంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు. కానీ ఈయన ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు.ముఖ్యంగా ఈయన సెలబ్రిటీల భవిష్యత్తును ముందుగానే ఊహించి చెప్పడం.. అందులో కొన్ని నిజమవ్వడం వల్ల వేణు స్వామి ఫేమస్ అయిపోయారు. అయితే అలాంటి వేణు స్వామి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పూజలను ఎవరు చేయని విధంగా చేసి చూపిస్తారు. ముఖ్యంగా పిల్లలు పుట్టని వారికి కామాఖ్య టెంపుల్ కొండమీద కలిస్తే పిల్లలు పుడతారని,అలాగే కొన్ని పూజలలో మద్యం,మాంసాన్ని నైవేద్యంగా పెడతానని ఇలా చెప్పి విమర్శలు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.అయితే అలాంటి వేణు స్వామి గురించి తాజాగా ఒక టాలెంట్ బయటపడింది.అదేంటో ఇప్పుడు చూద్దాం.వేణు స్వామి తాజాగా వకుట భైరవ పేరుతో ఒక పూజని నిర్వహించారు.

అయితే ఈ పూజ చేసే సమయంలో మద్యం,మాంసం నైవేద్యంగా పెట్టడమే కాకుండా ఆ మాంసాన్ని హోమంలో వేసి ఆహుతి చేసేసారు. అంతేకాకుండా ఈ పూజ ప్రతిఫలం దక్కాలంటే నీళ్లలో తేలియాడుతూ వకుట భైరవ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని తన ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి నీళ్లపై తేలియాడుతూ వకుట టైరవ మంత్రాలను చదివాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో వేణు స్వామి లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా..

అంత భారీ శరీరంతో నీళ్లపై తేలియాడి మంత్రాలు చదవడం మామూలు విషయం కాదు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక వేణు స్వామి చేసిన ఈ వకుట భైరవ పూజ ఎందుకు చేస్తారంటే కోర్టు వివాదాలు,రాజకీయ సమస్యలు, శత్రువుల పీడ విరగడ కోసం చేస్తూ ఉంటారట. అయితే వేణు స్వామి గత కొన్ని రోజులుగా ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు కాబట్టి ఆయన కోసం ఈ పరిహార పూజ చేసుకున్నారు కావచ్చు అంటూ ఈ ఫొటోస్ చూసిన జనాలు కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: