
ఈ వీడియోపై స్పందించిన యాక్టింగ్ కోచ్ కిషోర్ నమిత్ కపూర్ మాట్లాడుతూ –“రామ్ చరణ్ మొదటిసారి కెమెరా ముందు నటించిన క్షణం అది. చాలా సిగ్గుగా, భయంగా ఫీల్ అయ్యాడు. కానీ అదే చరణ్ తర్వాత ఇండస్ట్రీలో ఎంతటి స్థాయికి ఎదిగాడో చూడండి – అది నిజమైన డెడికేషన్ కు ఉదాహరణ.”అదే సమయంలో శ్రియ శరణ్ గురించిన కోచ్ పొగిడేశారు. ఆమె అప్పటికే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, తన నటనలో ఇంకా మెరుగులు దిద్దుకోవడానికి ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటూ ఉందని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్లిప్ బాగా వైరల్ అవుతోంది. వీడియోలో రామ్ చరణ్ పొడవాటి జుట్టుతో, కళ్లజోడు వేసుకుని చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. సీన్‌లోని ప్రతి క్షణం ఇప్పుడు ఫ్యాన్స్ హృదయాలను కదిలిస్తోంది.
ఫ్యాన్స్ కామెంట్స్‌లో “ఇంత సిగ్గుగా ఉన్న చరణ్ ఇవాళ గ్లోబల్ స్టార్‌గా ఎదగడం నిజంగా ప్రేరణ”, “అద్భుతమైన జర్నీ” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు అయితే “ఇలాంటి వీడియోలు చూస్తే అసలు స్టార్‌ల కష్టాలు తెలుస్తాయి” అని కామెంట్స్ చేస్తున్నారు.నేటి రోజుల్లో ఒక్క సినిమా కోసం వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రామ్ చరణ్, ఒకప్పుడు ‘ఐ లవ్ యూ’ అనడానికి వణికిపోయాడంటే – అది ఆయన ప్రయాణం ఎంత గొప్పదో చెప్పకనే చెబుతోంది.ఇప్పుడా పాత వీడియో చూసిన తర్వాత అభిమానులు ఒక్క మాటే అంటున్నారు ..“ఇదే నిజమైన ఇంప్రూవ్మెంట్.. ఇదే రామ్ చరణ్!”