
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఈ పిచ్చి ఏంటి రా బాబు.. రోజు ఖచ్చితంగా ఒక్కసారి అయినా అది ఉండాల్సిందే..!

ఆమె చెప్పిన ప్రకారం — “రామ్ చరణ్ ఎక్కడికైనా వెళ్ళినా, ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ షూటింగ్ స్పాట్ అయినా సరే — రాత్రి భోజనంలో ‘రసం అన్నం’ లేకపోతే ఆయనకు నిద్రే పట్టదు. ఆమ్లెట్‌తో కలిపిన రసం అన్నం ఆయనకు మోస్ట్ ఫేవరెట్ ఫుడ్. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన స్వయంగా ఆ ఇంగ్రిడియెంట్స్ క్యారీ చేసుకుంటూ వెళ్తాడు,” అని ఉపాసన చెప్పింది.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది మెగా అభిమానులు రామ్ చరణ్ సింప్లిసిటీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. “వేల కోట్ల ఆస్తి ఉన్నా, ఇలా సాధారణంగా ఉండే మన రామ్ చరణ్ మాదిరి స్టార్ ఇంకెవరు?” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మెగా ఫ్యాన్స్ “అందుకే ఆయన మనకు గర్వకారణం, మన హీరో!” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
అయితే కొంతమంది మాత్రం ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ కనిపిస్తున్నారు. కానీ రామ్ చరణ్ గురించి తెలిసినవారికి తెలుసు — ఆయన ఎవరి మాటలు పట్టించుకోరు. తన పనిని తనదైన విధంగా చేస్తూ, తన ప్యాషన్, తన డెడికేషన్‌తో ముందుకు సాగుతారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ది” చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నా ఆయన రసం అన్నం పట్ల ఆయన ప్రేమ, తన సింపుల్ లైఫ్ స్టైల్ మాత్రం ఎప్పటికీ మారదనేది ఈ కథ చెబుతోంది.