యంగ్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ తెరకెక్కించిన డ్యూడ్ చిత్రంలో మమితా బైజు, నేహా సెట్టి, ప్రదీప్ నటించగ అలాగే ఇందులో కీలకమైన పాత్రలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా నటించారు. ఈ చిత్రం యూత్ ను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ తోనే చూపించారు. ఈ చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య ప్రేమను చూపించే విధానం కూడా అద్భుతంగా ఉందని, సినిమా ఫస్టాఫ్ సూపర్ గా ఉందని ట్విట్టర్లో పలువురు నెటిజెన్స్ తెలుపుతున్నారు.మరి కొంతమంది లవ్ టుడే ఫార్మాట్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ రంగనాథ తన పాత్రలో అద్భుతంగా నటించారని, ఫన్ ,ఎమోషన్స్ సీన్స్ లో కూడా అద్భుతంగా ఆకట్టుకున్నారు. అలాగే హీరోయిన్ మమితా బైజు తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. హీరోయిన్స్ తో ప్రదీప్ రంగనాథన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని తెలియజేస్తున్నారు. నేహా శెట్టి గ్లామర్ మరింత అట్రాక్షన్ అని, ఇంటర్వెల్ లో ట్విస్ట్ అదిరిపోతుందని, సినిమా యూనిక్ గా ఉందంటూ తెలుపుతున్నారు. సెకండ్ పార్ట్ లో కథ కాస్త డిఫరెంట్ గా రాసి ఉంటే మరింత బాగుండేదేమో అంటూ నేటిజన్స్ తెలుపుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే డ్యూడ్ సినిమా అదిరిపోయిందని ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ కొట్టారంటు నేటిజన్స్ తెలుపుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి