టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో ఎక్కువమంది రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగా మరి కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. తాజాగా అందాల తార రాశి కూడా ఎన్నో చిత్రాలలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల ఆకట్టుకుంది. రాశి ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఈమధ్య బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి పలు విషయాలను తెలిపింది.


ఈమెరకు తాను మళ్ళీ సినిమాలలోకి రాబోతున్నానని ఇప్పటికే ఐదు సినిమాలకు సంబంధించి షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ చిత్రాలను వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్గా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ వెల్లడించింది. ప్రస్తుతం రాశి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇక అభిమానులు కూడా ఈ విషయంపై  ఆనందపడుతున్నారు. రాశి సినీ కెరియర్ విషయానికి వస్తే 9 ఏళ్ల వయసులోనే మమతల కోవెల అనే చిత్రంలో బాలనటిగా ఎంట్రీ వచ్చింది. కానీ రాశికి శుభాకాంక్షలు , గోకులంలో సీత, పెళ్లి పందిరి వంటి చిత్రంతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది రాశి.


తన సినీ కెరియర్లు 50కు పైగా చిత్రాలను నటించింది.నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకేక్కించడం వల్ల,  కథల ఎంపిక విషయంలో తడబడడం సినీ కెరియర్ పడిపోయింది. చివరిగా 2017లో లంక అనే సినిమాలో నటించింది. రాశి 2005లో అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది అతని పేరు శ్రీముని. వీరికి ఒక అమ్మాయి కూడా ఉన్నది. రాశి ప్రస్తుతం బుల్లితెర పైన అదరగొట్టేస్తోంది మరి త్వరలోనే వెండితెర పైన ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణంలో ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: