మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . చిరుకి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం మరియు మర్యాదలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే . ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు లాగా చిరుని చూస్తూ ఉంటారు . ఇక అందుకే ఇండస్ట్రీలోని నటీనటులు మరియు హీరోలు అదేవిధంగా నిర్మాతలు, డైరెక్టర్లు చిరంజీవికి అత్యంత గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు . ఇక బండ్ల గణేష్ మెగా అభిమాని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లకు వీర అభిమాని అని ఎన్నోసార్లు బండ్ల గణేష్ నిరూపించుకున్నాడు . ఇక తాజాగా బండ్ల గణేష్ తన ఇంట్లోనే దివాలి పార్టీ ఇచ్చాడు . దీనికి సినీ పెద్దలు కూడా విచ్చేశారు . మైత్రి మూవీ మేకర్స్ మరియు శ్రీకాంత్, సిద్దు జోనల్ గడ్డ లాంటివారు రావడం జరిగింది . ఇక చిరంజీవి ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్ గా వెళ్లడం ఆశ్చర్యం . చిరు మరియు శ్రీకాంత్ ఒకే కారులో దిగడం జరిగింది . చిరంజీవి కారు నుంచి దిగగానే బండ్ల గణేష్ వెళ్లి కాళ్లకు నమస్కరించుకోవడం జరిగింది .


అనంతరం చిరు చేతులు పట్టుకుని ఇంట్లోకి ఆప్యాయంగా తీసుకెళ్లాడు బండ్ల గణేష్ . చిరంజీవి కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన చైర్ లో కూర్చోబెట్టి అభిమానం వ్యక్తం చేశాడు . ఇక ప్రజెంట్ ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ ఒక వీడియోతో చిరు అంటే బండ్ల గణేష్ కి ఎంత అభిమానమో ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పుకోవచ్చు . ఏదేమైనా బండ్లన్న చేసిన ఈ పని ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఇక చిరంజీవి ప్రజెంట్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: