దివంగత నటి శ్రీదేవి చనిపోయినా ఆమె సినిమాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటుంది.అయితే అలాంటి శ్రీదేవి చివరి కోరిక గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు దిగ్గజ డైరెక్టర్ రాఘవేంద్రరావు.. ఆయన ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి చివరి కోరిక బయట పెడుతూ ఆమె దానికి అర్హురాలు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి శ్రీదేవి చివరి కోరిక ఏంటి.. ఆమె అర్హురాలు  దేనికి కాదని రాఘవేంద్రరావు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. శ్రీదేవి రాఘవేంద్రరావు డైరెక్షన్లో ఎన్నో సినిమాలు చేసింది. అలా దాదాపు 24 సినిమాలు చేసిందట. అదే సమయంలో శ్రీదేవి తన చివరి కోరికగా రాఘవేంద్రరావుతో 25వ సినిమా చేయాలి అనుకుందట.


 అలా నేను మీ డైరెక్షన్లో 25 సినిమా చేస్తే నా కోరిక తీరుతుంది అని చెప్పిందట. అయితే అప్పటికీ శ్రీదేవికి చనిపోతుందనే విషయం ఆమెకు తెలియదు కదా.. అయితే శ్రీదేవి రాఘవేంద్రరావుతో 25వ సినిమా చేయాలని అనుకుందట. అంతే కాదు శ్రీదేవి నటించిన చివరి మూవీ మామ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒకసారి రాఘవేంద్రరావు దగ్గరికి వచ్చి సర్ మీతో 25వ సినిమా చేస్తాను ఒప్పుకోండి ప్లీజ్ అని అనడంతో శ్రీదేవి అంతలా కోరడంతో కాదనలేక రాఘవేంద్రరావు కూడా ఓకే చెప్పారట.

కానీ ఆమె కోరిక తీరుద్దామని 25వ సినిమా చేద్దాం అనుకునే లోపే శ్రీదేవి మరణించింది.ఆ సమయంలో శ్రీదేవి మరణ వార్త విని రాఘవేంద్రరావు గుండె ముక్కలైందట.. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా రాణించిన శ్రీదేవి మరణానికి అర్హురాలు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అలాగే తన చివరి కోరిక తీర్చుకోలేక చివరి కోరికకు అర్హురాలు కాలేక పోయింది అంటూ రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా రాఘవేంద్రరావు తో కలిసి 25వ సినిమా చేయాలి అని కోరుకున్న శ్రీదేవి చివరి కోరిక తీరకుండానే చనిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: