
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన జనసేన అధినేతగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే, సినిమాలలో తనదైన ముద్ర వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాల్లో నటించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన 'ఓజీ' (OG) సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ మరిన్ని కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ పారితోషికం భారీ స్థాయిలో ఉన్నప్పటికీ, ఆయనతో సినిమా నిర్మించడానికి ఆసక్తి చూపే నిర్మాతల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, పవన్ కళ్యాణ్ మూడు నుంచి నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు కొన్ని సినిమాలు, ఎన్నికల తర్వాత మరికొన్ని సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ప్రణాళిక వేసుకున్నట్లు సినీ వర్గాల టాక్. రాజకీయాలతో పాటుగా తన సినీ ప్రయాణాన్ని కూడా కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటనా జీవితంతో పాటు, రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. త్వరలోనే ఆయన నుంచి కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. పవన్ కెరీర్ ప్లన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.