
తెలంగాణ ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు నటిగా పేరు సంపాదించిన సౌమ్య శెట్టి పైన పలు సంచలన ఆరోపణలు చేశారు. స్నేహం అనే పేరుతో సోషల్ మీడియా ద్వారా పరిచయమై తన దగ్గర నుంచి 86 లక్షలు కా చేసిందని ఈనెల 11న విశాఖపట్నంలో ఫిర్యాదు చేశారు లక్ష్మీ కాంత్ రెడ్డి. ఈయన మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు.
ఈ ఏడాది మార్చిలో సౌమ్య శెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యిందని, విశాఖ ప్రాంతంలో ఉండే ఒక రీసార్ట్ కలిశామని, ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగాక తనకు ఆరోగ్యం బాగాలేదని ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నానని చెప్పి దశలవారిక తన దగ్గర నుంచి రూ.86 లక్షలు రూపాయలు కాజేసిందని, అలాగే బంగారం కూడా తీసుకుందంటూ లక్ష్మిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. అలా డబ్బు సమకూర్చుకున్న తర్వాత తనని దూరం పెడుతూ..లాయర్ ద్వారా బెదిరిస్తోందనే ఆరోపణలు చేశారు. ఈ మోసాన్ని సౌమ్య శెట్టి భర్త ఆమె తల్లి కూడా సహకరించారు అంటూ ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు సైతం విచారణ చేసిన తరువాత సౌమ్యశెట్టి గతంలో కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక యువతీ ఇంట్లో బంగారం చోరీ చేసిన కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉందంటూ తెలుపుతున్నారు. ఇలా ఎన్నో మోసాలను చేస్తూ లాయర్ల సహాయంతో సెటిల్మెంట్ చేసుకుంటోందని ఆరోపణలు చేశారు లక్ష్మీకాంత్ రెడ్డి.