మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మళ్లీ ఒక సూపర్ హిట్ సినిమా “వాల్తేరు వీరయ్య”. ఈ సినిమాతో రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తన సత్తా మరోసారి నిరూపించుకున్నారు. ఆ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు ఆయన అదే దర్శకుడు కొల్లి బాబీ తో రెండోసారి జట్టుకట్టబోతున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి మాస్ అవతారం ఎంత ఆకట్టుకుందో ప్రేక్షకులకు వాల్తేరు వీరయ్య సినిమాతో బాగా రిజిస్టర్ అయ్యింది. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ - ప్రొడక్షన్ దశలో ఉందని, షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఇక తాజా టాక్ ప్రకారం, మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ షెడ్యూల్‌లు కూడా అలా ప్లాన్ అవుతున్నాయని టాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే, వచ్చే ఏడాది చివర్లో చిరంజీవి అభిమానులకు ఇది పెద్ద పండగ కానుంది. ఒకే యేడాది చిరు నుంచి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముందుగా సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు.. ఆ తర్వాత సమ్మర్‌లో విశ్వంభర .. ఆ తర్వాత డిసెంబర్ లో బాబి సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
బాబీ ఈసారి చిరంజీవిని పూర్తిగా కొత్త లుక్‌లో చూపించాలని డిసైడ్ అయ్యారట. బాబి బాలయ్యతో తెరకెక్కించిన “ డాకు మహరాజ్ ” టీజర్ ద్వారా చూపించిన సరికొత్త ప్రెజెంటేషన్‌ను చూసి ఫ్యాన్స్ ఇప్పటికే హైప్‌లో ఉన్నారు. అదే రేంజ్‌లో చిరంజీవిని మరింత స్టైలిష్ మరియు పవర్ ఫుల్ రోల్‌లో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి సంగీతం, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రొడక్షన్ హౌస్ వివరాలు కూడా వచ్చే వారాల్లో ప్రకటించనున్నారు. మొత్తంగా చెప్పాలంటే, చిరంజీవి - బాబీ కాంబినేషన్ 2.0 పై టాలీవుడ్ అంతా కళ్ళు పెట్టి చూస్తోంది. అభిమానులు మాత్రం ఇది మరో ఇండస్ట్రీ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి