హీరో మనోజ్ మాట్లాడుతూ -`మా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మేము ఎంచుకున్న మార్గమే ఈ ప్రమోషనల్ సాంగ్..ఈ పాటతో మా సినిమాని ప్రమోట్ చేసి థియేటర్స్ వరకూ తీసుకెళ్లాలి అన్నదే మా టీమ్ ఉద్దేశ్యం..పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నది ఈ పాటలో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా ఒక యంగ్‌స్టర్ జర్నీ..ఒక కాలేజ్ యువత జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది..అది ఎలా డీవియేట్ అవుతుంది దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అన్నది ఈ సినిమాలో చూపించాం. డైరెక్టర్ ఎఫ్పీ రోజర్స్ గారు వచ్చి ఈ కథ చెప్పగానే చాలా నచ్చింది. గీత సుబ్రమణ్యం తర్వాత మళ్లీ నాకు అంత హై ఇచ్చిన ఫిల్మ్ ఇది. త్వరతోనే మీడియా వారికి ఒక ప్రీవ్యూ ప్లాన్ చేస్తున్నాం..మా హీరోయిన్ జయత్రీ చాలా బాగా చేసింది. ఆమె క్యారెక్టర్ నేటి యువతకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రవిజ్ మాట్లాడుతూ- `` మాది చిన్న సినిమా అయినా మ్యూజిక్, మేకింగ్ కి మనోజ్ చాలా ఖర్చు పెట్టారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. దర్శకులు మంచి ఔట్‌పుట్ తీసుకువచ్చారు. ఆదిత్య ఒక మంచి క్యారెక్టర్లో కనిపిస్తారు. టీమ్ అందరు చాలా కష్టపడి బెస్ట్ ఔట్ పుట్ తీసుకువచ్చారు. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ కమల్ నాబ్ మాట్లాడుతూ - `ఈ సినిమాకి మనోజ్ ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ..అన్నీ తానే చూసుకున్నాడు.. మనోజ్ కి యాక్టింగ్ అంటే ప్యాషన్..ఆ ప్యాషన్‌తోనే చాలా కష్టపడి సినిమా కంప్లీట్ చేశాడు..సినిమా చాలా బాగా వచ్చింది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ..ఒక లైఫ్ స్టోరీ అని చెప్పొచ్చు. యువతరం అందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది. మా ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ` అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి