తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు తయారైంది రామ్ చరణ్ జీవితంలో కొన్ని సందర్భాలు. అవి  నిజంగా ప్రత్యేకంగా జరిగాయి. ప్రస్తుతంలో చరణ్ "పెద్ది" అనే భారీ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా షూట్ అల్మోస్ట్ పూర్తి స్థాయికి చేరింది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నారు. ప్రతి విషయం సరిగ్గా  వెళ్ళితే, రామ్ చరణ్  పుట్టిన రోజు, 2026 మార్చ్ 27న సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాతనే చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగస్థలం 2 ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నారు. రంగస్థలం సీక్వెల్ గానే తెరకెక్కుతుందో ఇంకా ఖచ్చితంగా తెలియదు, కానీ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఫిక్స్ అయింది. ఇప్పటికే 2026 ఏప్రిల్‌లో పూజ కార్యక్రమాలు మొదలుపెట్టి, సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు.  సుకుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.


అయితే, ఈ మధ్యలో ఉపాసన గర్భవతి అయ్యారు.ఆమెకు ట్విన్స్ జన్మనివ్వబోతున్నారు. ఇలాంటి సమయంలో, రామ్ చరణ్ తన భార్యకు మద్దతుగా ఉండడం అత్యంత అవసరం. అందుకే చరణ్ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మిస్ కాకుండా, ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించారట. ఈ వార్త అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్  మీడియాలో వైరల్ అయిన న్యూస్ ప్రకారం, చరణ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ లేదా జూనియర్ ఎన్టీఆర్ రావచ్చని ఆలోచిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే కాల్ షీట్స్ పరంగా బిజీగా ఉన్నారురు. ప్రసెంట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.. ఆ తర్వాత దేవర 2 ప్రాజెక్ట్‌కు కాల్ షీట్స్ ఫిక్స్ అయ్యాయి. తదుపరి త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఫిక్స్ అయ్యింది.



ఇలాంటి సమయంలో, సుకుమార్ డైరెక్ట్ చేసే ప్రాజెక్ట్‌లో మార్పులు చేయడం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.  జూనియర్ ఎన్టీఆర్ - సుకుమార్‌తో ఆల్ రెడీ మాట్లాడేశారని తెలుస్తుంది. కాల్ షీట్స్ ఎలా సర్దుబాటు చేసుకుంటారో ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు, ప్రభాస్  కూడా పలు ప్రాజెక్ట్‌లల్లో ఫుల్ బిజీ బిజీ.. సలార్ 2, కల్కి 2, రాజా సాబ్ 2, ఫౌజి లాంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇది వచ్చే ఐదు సంవత్సరాలపాటు ఆయన బిజీ షెడ్యూల్‌లో కొనసాగనుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చూడాలి, జూనియర్ ఎన్టీఆర్ మరియు సుకుమార్ ఈ పరిస్థితిని ఎట్లా సర్దుబాటు చేస్తారు అనేది..??  ఇది తారక్ కి న్యూ హెడేక్ అంటున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: