సినిమాల్లో కొన్ని కొన్ని కాంబోలు సెట్ అవుతాయి. మరికొన్ని కాంబోలు మూవీ అనుకున్నాక మధ్యలో ఆగిపోతాయి. అలాంటి కాంబోనే వెంకటేష్ ఇలియానా. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరి కాంబోలో ఏకంగా మూడు సినిమాలు ఆగి పోయాయట. మరి ఆ సినిమాలేంటి? ఎందుకు వీరి కాంబోలో సినిమా రాలేకపోయింది అనేది ఇప్పుడు చూద్దాం.. వెంకటేష్ కామెడీ, యాక్షన్,ఎమోషన్ వీటన్నింటికీ పెట్టింది పేరు..ఈయన కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది.అందుకే ప్రేక్షకులతో పాటు యూత్ కూడా ఈయన సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అలాంటి వెంకటేష్ ఇలియానా కాంబో లో మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఇలియానా హీరో హీరోయిన్లుగా డివివి దానయ్య నిర్మాణంలో ఓ సినిమా ఫిక్స్ అయింది. 

కానీ ఆ తర్వాత ఎందుకో ఈ మూవీ పట్టాలెక్కలేదు. అంతేకాకుండా అమ్మా రాజశేఖర్ డైరెక్షన్లో ఇలియానా హీరోయిన్ గా.. వెంకటేష్ హీరోగా.. గంగా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. దానికి కారణం ఆ టైంలో వెంకటేష్ వరుసగా చేసిన యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ బోల్తా పడ్డాయి. అలా చింతకాయల రవి, నాగవల్లి,నమో వెంకటేశాయ,ఈనాడు, బాడీగార్డ్ వంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.ఆ తర్వాత వచ్చే గంగా సినిమా కూడా అదే జానర్ అవ్వడంతో వర్కౌట్ అవ్వదని మధ్యలోనే వదిలేశారు.

అలా ఈ కాంబో కూడా మధ్యలోనే అయిపోయింది. ఇక మూడో సినిమా ఏంటంటే..దశరథ్ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా ఓ సోషియో ఫాంటసీ మూవీ ని అనుకున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానాని ఫిక్స్ చేశారు.కానీ ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. అలా మూడుసార్లు వెంకటేష్ ఇలియానా కాంబోలో సినిమా ఫిక్స్ చేసి చివరికి ఆగిపోయాయి. దాంతో మళ్ళీ వీరి కాంబోలో సినిమా కూడా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: