ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు కనిపించడం అంటే ప్రేక్షకులకి ఓ పండగే. అలాంటి ట్రెండ్ ఇప్పుడు దక్షిణ భారత సినీ ప్రపంచంలోనే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సెన్సేషనల్ న్యూస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది మరేంటో కాదు — సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు విశ్వరూప నటుడు కమల్ హాసన్ ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారనే వార్త! ఈ ఇద్దరు లెజెండరీ నటులు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారంటే అది కేవలం సినిమా కాదు, ప్రేక్షకులకి ఓ విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం, ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోతున్నది హిట్ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకాంత్‌తో ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ఆయన ఇప్పుడు ఈ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, రజనీ మరియు కమల్ ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే తమ కాల్‌షీట్స్ కూడా ఇచ్చేసారట.ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా మొత్తంలో హల్‌చల్ చెలరేగింది. “ఇండియన్ సినిమాకి గోల్డెన్ మోమెంట్” అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు “ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో.. ఇది లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియెన్స్” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పుడు అభిమానులలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా వార్తల ప్రకారం, ఈ మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్‌లుగా నయనతార మరియు త్రిష ఎంపికయ్యారట. ఇది విన్న వెంటనే అభిమానుల్లో కొత్త ఎగ్జైట్‌మెంట్ మొదలైంది.గతంలో నయనతార మరియు త్రిష మధ్య వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా కొన్ని టెన్షన్‌లు ఉన్నాయని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకే సినిమాలో నటించబోతున్నారని తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. కొందరు “ఇంతకాలం తర్వాత ఇలాంటి కాంబినేషన్ ఊహించలేదు” అంటున్నారు.


ఇక సోషల్ మీడియాలో ఈ వార్తలు పూర్తిగా వైరల్ అయ్యాయి. రజనీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ అంటేనే ఒక సూపర్ హైప్. దానికి నయనతార, త్రిష వంటి స్టార్ హీరోయిన్‌ల యాడిషన్ అంటే ఈ సినిమా రికార్డులను తలకిందులు చేసే అవకాశం ఉంది. సినిమా పెద్ద స్థాయిలో తెరకెక్కించడానికి ప్రొడ్యూసర్లు కూడా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారట. హాలీవుడ్ స్టైల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారన్న ప్రచారం కూడా ఉంది.ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు “ఇది డ్రీమ్ కాంబినేషన్.. ఈ తరహా సినిమా మళ్లీ చూడలేము” అంటుంటే, మరికొందరు మాత్రం “ఇద్దరూ సీనియర్ హీరోలు.. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి” అంటున్నారు.ఏమైనా సరే, రజనీ–కమల్ మల్టీస్టారర్ మూవీ అనగానే దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి తెరపై కనిపించే రోజు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: