రాజమౌళి సినిమా అంటే ఎంతటి అద్భుతాలు ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ఎవరైనా సరే వెనక్కి తగ్గాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లెవెల్ లో ఓ సినిమా తీయబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరో ఏకంగా రాజమౌళి సినిమాకే ఎదురు వెళ్తున్నారు. రాజమౌళి అయితే నాకేంటి ఎవరైతే నాకేంటి అనే లెవెల్ లో తన సినిమాని విడుదల చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే రవితేజ.. ఇక రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ అక్టోబర్ 31న బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్  2 కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే..

 అలాంటి బాహుబలి ది ఎపిక్ మూవీకి రవితేజ మాస్ జాతర మూవీ ఎదురు వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. రాజమౌళి సినిమా  విడుదలవుతుందంటే ఎవరైనా సరే తమ సినిమాని వాయిదా వేసుకోవాల్సిందే.అలాంటిది రవితేజ మాత్రం రాజమౌళి సినిమాకి ఎదురెళ్తున్నారు. ఆ మధ్యకాలంలో బాహుబలి ఫస్ట్ టైం విడుదలైన టైంలో మహేష్ బాబు శ్రీమంతుడు వంటి పెద్ద సినిమానే వాయిదా వేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు మాస్ జాతర మూవీ బాహుబలి సినిమాకి ఎదురెళ్తుంది అంటే నిజంగా ధైర్యమే అని చెప్పుకోవాలి.

అయితే మాస్ జాతర మూవీ పై మేకర్స్ కి భారీ నమ్మకం ఉండడం వల్లే బాహుబలి సినిమా రిలీజ్ అవుతున్న సరే లెక్కచేయకుండా ఆ సినిమాకి ఎదురెళ్తున్నారు. టాక్ బాగుంటే ఓకే కానీ బోల్తా పడితే మాత్రం కోలుకోవడం చాలా కష్టం అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్. ఇక రాజమౌళి రవితేజ కాంబినేషన్లో విక్రమార్కుడు సినిమా వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: