పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. ఆయన అలా ఒక చూపు చూశారంటే చాలు ఎంతోమంది అమ్మాయిలు పడిపోతారు అంతే.. అమ్మాయిలే కాదు పెళ్లయిన వాళ్ళకి కూడా ప్రభాస్ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. అయితే కేవలం మామూలు జనాలకే కాదు సినీ సెలబ్రిటీలకు కూడా ప్రభాస్ అంటే విపరీతమైన పిచ్చి. అయితే అలాంటి ప్రభాస్ మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న ఓ హీరోయిన్ ఏకంగా షూటింగ్స్ సెట్ లోనే ఆయనకు లవ్ లెటర్ రాసి టార్చర్ చేసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రభుదేవా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన పౌర్ణమి సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష, ఛార్మిలు హీరోయిన్స్ గా నటించారు. 

అయితే ఈ మూవీలో త్రిష ఫస్ట్ హీరోయిన్ గా ఫిక్స్ అయినప్పటికీ ఛార్మి ప్లేస్ లో మొదట మరో హీరోయిన్ ని తీసుకున్నారట.ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సమయంలో ఆ హీరోయిన్ ప్రభాస్ ని ప్రేమిస్తున్నానని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టిందట.మరీ ముఖ్యంగా షూటింగ్స్ సెట్ లోనే ప్రభాస్ కి లవ్ లెటర్ రాసి ఆయన్ని ఎలాగైనా ప్రేమలో దింపాలని చూసిందట.అయితే ఆ హీరోయిన్ ప్రవర్తన చూసి విసిగిపోయిన ప్రభాస్ వెంటనే ప్రభుదేవాతో చెప్పి ఆ హీరోయిన్ తో నటించాలంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. వెంటనే ఆ హీరోయిన్  ని తీసేయండి అని చెప్పారట.

దాంతో ప్రభుదేవాహీరోయిన్ చేసే పనులు చూసి ఆమెను సినిమా నుండి తీసేసి ఆ హీరోయిన్ ప్లేస్ లో  ఛార్మి ని పెట్టుకున్నారు.ఆ తర్వాత పౌర్ణమి సినిమా ఛార్మి త్రిష లతో తెరకెక్కింది. అయితే అప్పట్లో ఆ హీరోయిన్ కి ప్రభాస్ అంటే తెగ ఇష్టం ఉండేదట.కానీ ప్రభాస్ మాత్రం ఆ హీరోయిన్ ని చూసి చూడనట్లుగా వదిలేసేవారట. అయితే ప్రస్తుతం ఆ హీరోయిన్ కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. దాంతో ఆ హీరోయిన్ పేరు ఇప్పుడు చెప్పుకోవడం అంత మంచిది కాదు. కానీ అప్పట్లో ప్రభాస్ ని పౌర్ణమి సినిమా షూటింగ్ సెట్లో మాత్రం ఆ హీరోయిన్ చాలా ఇబ్బంది పెట్టిందనే వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: