ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. పుష్ప పార్ట్ 1 విడుదల సమయానికి అల్లు అర్జున్ కి ఇండియా వ్యాప్తంగా పెద్ద స్థాయిలో గుర్తింపు లేదు. కానీ పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా అల్లు అర్జున్ కు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే పుష్ప పార్ట్ 2 మూవీ పై అంచనాలు కూడా భారీ స్థాయికి చేరిపోయాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన పుష్ప పార్ట్ 2 మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో బన్నీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

ప్రస్తుతం బన్నీ తమిళ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ లో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు , అందులో మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటువంటి పూజ హెగ్డే ను తీసుకోవాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఈ బ్యూటీ ని సంప్రదించగా ఆమె కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ , పూజ హెగ్డే కాంబోలో ఇప్పటికే దువ్వాడ జగన్నాథం , అలా వైకుంఠపురంలో అనే రెండు సినిమాలు వచ్చాయి. అందులో అలా వైకుంఠపురంలో సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలు పెద్ద స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు. దానితో ఇప్పుడు పూజా హెగ్డే ను ఈ సినిమాలో తీసుకోవడం కాస్త రిస్క్ అవుతుంది అని అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa