కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమాకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పేరు సంపాదించిన రజనీకాంత్ కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ముఖ్యంగా రజనీకాంత్ సినిమా విడుదల అవుతోంది అంటే చాలు  సంస్థలు(కాలేజీలు , విద్యాసంస్థలు, ఐటీ కంపెనీ) ఏకంగా హాలిడేస్ ని ప్రకటిస్తూ ఉంటాయి. అంతటి స్టార్ డమ్ కలిగి ఉన్న రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు వినిపిస్తోంది.


రజనీకాంత్ ,కమలహాసన్ కాంబినేషన్లో వచ్చే సినిమానే చివరి సినిమాగా ఉండబోతున్నట్లు కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ నెల్సన్  డైరెక్షన్లో ఈ ప్రాజెక్టు 2027లో మొదలు కాబోతోంది. ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ రైటింగ్ కోసం డైరెక్టర్ నెల్సన్ సుమారుగా ఏడాది పాటు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేకి మరో ఏడాది సమయం పడుతుందని, ఇలా మొత్తానికి రజనీకాంత్ ఫైనల్ సినిమా ఇదే అన్నట్లుగా వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పేసి రజినీకాంత్ ఆధ్యాత్మిక బాటలో వెళ్లేలా చూస్తున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు కోలీవుడ్ లో మాత్రం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది..



రజనీకాంత్ సినీ కెరియర్ విషయానికి వస్తే ఈ ఏడాది కూలి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న రజినీకాంత్ రూ.500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు. జైలర్ 2 సినిమాతో వచ్చే యేడాది ప్రేక్షకులందరికీ రాబోతున్నారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2023లో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: