టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను AA 22 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా కు సంబంధించి సోషల్ మీడియాలో ఏ వార్త బయటకు వచ్చినా మామూలుగా వైరల్ కావడం లేదు. దాదాపు రు. 750 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం కూడా సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా కు సంబంధించి సరికొత్త బజ్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
ఈ ప్రెస్టీజియస్ సినిమా లో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు మరికొంత మంది కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారట. అయితే, తాజాగా ఈ సినిమా లో మరో అందాల భామ వచ్చి జాయిన్ అయ్యింది. ఈ షూటింగ్‌లో అందాల భామ మృణాల్ ఠాకూర్ జాయిన్ అయ్యిందని.. ఆమె కొన్ని సీన్స్ కూడా చేసినట్లు సమాచారం. దీంతో నిజంగానే ఈ సినిమా లో మృణాల్ నటిస్తుందా.. నిజంగానే ఆమె సెట్స్‌లో జాయిన్ అయిందా ? అనే ప్రశ్నలు అభిమానుల్లో వస్తున్నాయి. ఇక ఈ సినిమా లో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించ బోతున్నట్టు టాక్ ?
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి