ఇండియన్ సినీ ప్రపంచంలో హారర్ థ్రిల్లర్ జానర్‌కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే నిజమైన భయానకతను, గాఢమైన ఎమోషన్‌తో మిళితం చేసిన సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా కామెడీ కలిపిన హారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి — నవ్వులు తెప్పించే భయానక కథలు, ఫన్ హారర్ లైన్‌లో ఎక్కువగా ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ "ప్రాపర్ హారర్ సినిమా" అని చెప్పుకోదగిన సినిమాల లిస్టులో మాత్రం చాలా కొద్ది చిత్రాలే నిలిచాయి. ఆ కొద్ది సినిమాల్లో ఒక మాస్టర్‌పీస్ — "అరుంధతి" (2009). అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో కొత్త పంథాను సృష్టించింది. ఫాంటసీ, హారర్, థ్రిల్లర్ అన్నీ కలగలసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ప్రేమించడంతో, “లేడీ ఓరియెంటెడ్” సినిమాలకు కొత్త యుగం మొదలైందని చెప్పాలి. కోడి రామకృష్ణ దర్శకత్వం హై లెవెల్ గ్రాఫిక్స్ — అన్నీ కలిపి ఈ సినిమాను ఒక మేజిక్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.  పశుపతి ప్రవేశించే సీన్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.


ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో “అరుంధతి” రీమేక్ చర్చలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో కూడా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని పలువురు నిర్మాతలు ప్రయత్నించారు. ఆ సమయంలో కత్రినా కైఫ్, దీపికా పడుకొణె, కియారా అద్వాని వంటి టాప్ హీరోయిన్‌ల పేర్లు వినిపించాయి. కానీ ఏదో ఒక కారణం వల్ల ఆ ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయి.ఇప్పుడు అయితే కొత్తగా మళ్లీ ఈ భారీ ప్రాజెక్ట్‌కి ప్లానింగ్ మొదలైనట్లు సమాచారం. ఆ హిందీ వెర్షన్ కోసం ఎంపికైన హీరోయిన్‌గా తెలుగు బ్యూటీ శ్రీలీల పేరు ఫైనల్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.



“అరుంధతి” లాంటి పవర్‌ఫుల్ రోల్‌కి శ్రీలీలను సైన్ చేశారా?..“తెలుగు సినిమా రీమేక్‌కి మళ్లీ తెలుగు హీరోయిన్ నేనా?”..అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఒక స్ట్రాటజీ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హిందీ ప్రేక్షకుల కోసం కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించే ఒక ఫేస్ కావాలి — అంతే కానీ, రీమేక్ అనే బరువుతో కాకుండా పాన్-ఇండియా ఆడియన్స్‌ని ఆకట్టుకునే యాంగిల్‌లో ఈ కాస్టింగ్ జరిగిందట. ఇక ఈ వార్త బయటకు రావడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు...“వద్దు బాబోయ్..! శ్రీలీల ముఖం చూసి ఆ పశుపతి కూడా పారిపోతాడు!”..“అనుష్క లెవెల్‌కి రావడం అంటే ఈజీ కాదు” అంటూ మీమ్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాలో సరదా వాతావరణం నెలకొంది.మరి కొంతమంది మాత్రం సీరియస్‌గా కూడా చర్చిస్తున్నారు — అనుష్క చేసిన ఆ పాత్రలో ఉన్న గంభీరం, ఆత్మవిశ్వాసం, ఆ ఇన్‌టెన్సిటీని శ్రీలీల చూపగలదా? అరుంధతి పాత్రలోని మిస్టిక్ ఫీల్, శక్తివంతమైన ఎమోషన్‌ను పునరావృతం చేయడం అంత తేలికేమీ కాదు. ఏదేమైనా, ఈ వార్తలు నిజమైతే — ఇది శ్రీలీల కెరీర్‌లోనే కాదు, మహిళా కేంద్రిత సినిమాల స్థాయిలో కూడా మరో కొత్త అధ్యాయం కావొచ్చు. కానీ ఆమె అనుష్కలా ఆ ఇన్‌టెన్సిటీ, భయానక కీర్తి, రాణి అట్టిట్యూడ్ చూపగలదా అనేది మాత్రం సమయమే చెప్పాలి..?

మరింత సమాచారం తెలుసుకోండి: