తమిళ సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ వార్త బయటకు వచ్చిన నాటి నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అవ్వడమే కాకుండా, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. దర్శకుడిగా “ఖైదీ”, “మాస్టర్”, “విక్రమ్”, “లియో”, “కూలీ” వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లోకేష్‌ కనగరాజ్ ఇప్పుడు నటన వైపు మళ్లడం సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఇటీవల “కూలీ” సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన ఆయన, ఆ తర్వాత కొంత విరామం తీసుకుని కొత్త ప్రాజెక్టులపై ఆలోచిస్తున్నారు. “లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించబోతున్న కొత్త చిత్రం” అనే హెడ్లైన్ ఇప్పుడే తమిళనాడంతా ట్రెండ్ అవుతోంది.


ఈ సినిమాకు దర్శకుడిగా అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చే డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ వ్యవహరించబోతున్నారు అంటూ తెలుస్తుంది. అందుకే ఆయన దర్శకత్వంలో లోకేష్ నటన చూడబోతున్నామనే అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా  యంగ్ బ్యూటీ వామికా గబ్బి ఎంపికైనట్లు సమాచారం. వామికా ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె గ్లామర్, నటన రెండింటినీ సమానంగా మేళవించే నటి. ఇప్పుడు ఆమె తమిళంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా కనిపించబోతుండటంతో, దక్షిణాది ప్రేక్షకుల్లో కూడా ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది.



వామికా గబ్బి లుక్, స్టైల్, ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్ గురించి అందరికీ తెలిసిందే. అందుకే లోకేష్ కనగరాజ్‌తో ఆమె రొమాన్స్ చేయబోతున్నాడనే విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తోంది. “మిగతా హీరోలు కుర్చీలో కూర్చొని ఏడవాల్సిందే”, “లోకేష్ లెవెల్ ఏదో మరో లెవెల్” అంటూ నెట్‌జన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోనుంది. లోకేష్ కనగరాజ్ గతంలో కూడా యాక్షన్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. “ఖైదీ” నుంచి “విక్రమ్” వరకు ఆయన యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్‌తో సినిమాలను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లారు. ఇప్పుడు నటుడిగా ఆయన అలాంటి గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తే ఎలాంటి ఫైర్ వర్క్స్ జరుగుతాయో ఊహించడమే కష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: