 
                                
                                
                                
                            
                        
                        పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక హిందీలో తన కెరీర్ ని మొదలు పెట్టాక మరింత క్రేజీ పెరిగింది. అలాగే యానిమల్ సినిమాతో రణబీర్ కెరీయర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత పుష్ప 2 చిత్రంతో బాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. బాలీవుడ్లో విక్కీ కౌశల్ తో నటించిన ఛావా సినిమా భారీ విజయాన్ని అందించింది.
తాజాగా ఫిల్మ్ దయా డివైడ్ టాకుతో రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఆయుష్మాన్ ఖురాన్ కెరియర్ లోనే రూ.25 కోట్ల ఓపెనింగ్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలా ఈ ఏడాది నాలుగు చిత్రాలతో అలరించిన రష్మిక ప్రస్తుతం తాను నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రంపై ఫోకస్ పెట్టింది. నవంబర్ 7వ తేదీన రష్మిక నటించిన దిగర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందేమో చూడాలి. అలాగే మైసా సినిమా షూటింగ్ జరగబోతోంది. వీటికి తోడు బాలీవుడ్లో కాక్ టైల్ - 2 చిత్రంతో పాటు మరొక ప్రాజెక్టును చేయబోతున్నట్లు వినిపిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటించబోతోంది.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి