రష్మిక మందన్నా,దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా వస్తున్న తాజా మూవీ ది గర్ల్ ఫ్రెండ్.. చి.ల.సౌ ఫేం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్,పోస్టర్, ట్రైలర్ ప్రతి ఒక్కటి కూడా ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండడంతో సినిమా పై భారీ హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ బాధ్యతలను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తో పాటు రష్మిక మందన్నా కూడా తీసుకున్నారు. అలా రష్మిక మందన్నా, రాహుల్ రవీంద్రన్ ఇద్దరూ వరుస ప్రమోషన్స్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్సినిమా చేయాల్సింది రష్మిక మందన్నా కాదని.. మరో హీరోయిన్ అంటూ బాంబ్ పేల్చారు..ఇక రాహుల్ రవీంద్రన్ తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నేను ఏ స్టోరీ రాసినా కూడా దాన్ని నా స్నేహితులైనటువంటి సమంత,అడివి శేష్, వెన్నెల కిషోర్, సుజీత్ లకి ఇచ్చి చూడమని చెబుతాను.అలా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రాశాక సమంతకు ఇచ్చి చూడమని చెప్పాను.

 అయితే ఆ కథ మొత్తం చూసిన సమంత ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి నేను సెట్ అవ్వనని, రష్మికను తీసుకోమని సజేషన్ ఇచ్చింది. అలా సమంత ఇచ్చిన సజేషన్ తోనే రష్మికకు ఈ స్టోరీ పంపించా.. ఇక రష్మిక ఈ స్టోరీ చదివి రెండు రోజుల తర్వాత కాల్ బ్యాక్ చేసి నాకు ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది.వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం అని చెప్పింది. అలా సమంత చేయాల్సిన సినిమా రష్మికా మందన్నా చేసింది అంటూ రాహుల్ రవీంద్రన్  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: