భారతీయ సినిమా చరిత్రలో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన రీ రిలీజ్ సినిమా ఏదైనా ఉందంటే అది సందేహం లేకుండా ‘బాహుబలి: ది ఎపిక్’ అని చెప్పాలి. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుత గాథ, రెండు భాగాలుగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆ రెండు భాగాలను మళ్లీ రీ–కట్ చేసి, అత్యాధునిక టెక్నాలజీతో రీ–మాస్టర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దీంతో థియేటర్లలో మళ్లీ ‘ బాహుబలి మానియా ’ మామూలుగా లేదు.


ముందస్తు బుకింగ్స్ నుంచే ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాల్లోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా టికెట్లు సేల్ అవుతున్న వేగం కొత్త సినిమాలకు సరితూగేలా ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రీ - రిలీజ్ అయినా కూడా ‘బాహుబలి’కి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఇదే నిరూపిస్తోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం, మొదటి రోజే ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందట. మరికొన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలు కొనసాగితే ఈ సంఖ్య 20 కోట్ల వరకు వెళ్లవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రీరిలీజ్ సినిమాల్లో ఇంత భారీ ఓపెనింగ్ రావడం ఇదే మొదటిసారి అవుతుంది.


ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమకు ఇష్టమైన సీన్లు, సంభాషణలు, నేపథ్య సంగీతం గురించి పంచుకుంటూ నాస్టాల్జిక్ ఫీలవుతున్నారు. మొత్తానికి, ‘ బాహుబలి : ది ఎపిక్ ’ మళ్లీ ఒకసారి చరిత్ర సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రాజమౌళి విజన్, ప్రభాస్ - రాణా స్క్రీన్ ప్రెజెన్స్, కీరవాణి సంగీతం ఇవన్నీ కలిసి మరోసారి రికార్డుల వేట‌కు రెడీ అవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: