నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చి, ఇండస్ట్రీని ఏలడం సర్వసాధారణం. కానీ, ఆ ఫ్యామిలీ ఆడపడుచులు సాధారణంగా ప్రొడక్షన్, బిజినెస్ వైపే మొగ్గు చూపుతారు. నందమూరి బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని కూడా ఇప్పటివరకు అదే రూట్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 'అఖండ 2' లాంటి భారీ ప్రాజెక్టులకు నిర్మాతగా వ్యవహరిస్తూ, కెమెరా వెనుకే యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే, ఇప్పుడు ఆమె సడెన్‌గా కెమెరా ముందుకొచ్చి అందరికీ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. స్క్రీన్ పై మెరిసిన తేజస్విని .. మొదటిసారి తేజస్విని ఒక యాడ్ ఫిల్మ్ కోసం స్క్రీన్ మీద కనిపించారు. ప్రముఖ 'సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్'కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.
 

ఇక ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్‌లో తేజస్విని లుక్స్, ఆమె స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది కేవలం యాడ్‌లా కాకుండా, ఒక పక్కా కాన్సెప్ట్‌తో కూడిన మినీ మూవీలా ఉండటం విశేషం. ఈ యాడ్‌ను డి. యమునా కిషోర్ డైరెక్ట్ చేయగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దీనికి సంగీతం అందించారు. స్పోర్టీ గర్ల్ నుండి రాయల్ బ్రైడ్ వరకు .. ఈ యాడ్ కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. యాడ్ మొదట్లో తేజస్విని ఒక మోడ్రన్, స్పోర్టీ గర్ల్‌గా ఇండోర్ రాక్ క్లైంబింగ్ చేస్తూ కనిపిస్తారు. కష్టపడి ఆ గోడను ఎక్కిన ఆమెకు, పైకి వెళ్లగానే చేతికి ఉన్న పెద్ద డైమండ్ రింగ్ హైలెట్ అవుతుంది. ఆ తర్వాత ఆమె లుక్ పూర్తిగా మారిపోతుంది.

 

లగ్జరీ ట్రాన్స్‌ఫార్మేషన్: స్పోర్టీ లుక్ నుంచి ఆమె రాయల్ లుక్‌లోకి మారడం మరో హైలెట్. ఒక లగ్జరీ రాల్స్ రాయిస్ కారులోంచి దిగి, ప్యాలెస్ లాంటి చోట నడుచుకుంటూ వస్తారు. సంప్రదాయ సౌందర్యం: పెళ్లి సందడి, సంగీత్ వాతావరణంలో తేజస్విని రెండు డిఫరెంట్ లుక్స్‌లో ఆకట్టుకున్నారు. మొదట, స్టైలిష్ వైట్ లెహంగాలో, డైమండ్ నెక్లెస్‌తో గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్ చేస్తారు. ఆ వెంటనే, ఎర్రటి పట్టుచీరలో, పక్కా ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీ, వడ్డాణంతో ఎంతో హుందాగా, అందంగా కనిపిస్తారు. నట వారసత్వం .. నిజానికి, తేజస్విని కెమెరా ముందు ఇంత కంఫర్టబుల్‌గా ఉండటంలో ఆశ్చర్యం లేదు.

 

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవరాలిగా, బాలకృష్ణ కుమార్తెగా... నటన అనేది ఆమెకు రక్తంలోనే ఉంది. అందుకే, మొదటిసారి కెమెరా ఫేస్ చేసినా, ఏమాత్రం బెరుకు లేకుండా, చాలా క్యూట్‌గా, గ్లామర్‌గా యాడ్‌ను క్యారీ చేశారు. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఓనర్లు (నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మతుకుమిల్లి, శ్రీదుర్గ కాట్రగడ్డ) తేజస్వినిని అంబాసిడర్‌గా ఎంచుకుని తమ బ్రాండ్‌కు రిచ్ లుక్, క్లాస్ టచ్ ఇచ్చారు. ఇక ఫ్యూచర్‌లో ఆమెకు మరిన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఆఫర్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: