ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు వెంటనే కామెంట్స్‌తో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు –“అందమైన చిన్న మంత్రగత్తె!”..“మినీ స్టైల్ ఐకాన్!”..“నాన్నను మించిపోయే చార్మ్ ఈ చిన్నదిలో ఉంది!”అంతే కాదు, స్నేహా షేర్ చేసిన స్టోరీస్‌లో అర్హ అన్న అల్లు అయాన్ కూడా సిస్టర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ఫన్నీ మాస్క్ వేసుకున్న అయాన్, తన చెల్లితో కలిసి పంచుకున్న ఆ మజా మోమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక అర్హ గురించి చెప్పాలంటే – సినిమా ఆడియన్స్‌కు ఆమె కొత్త కాదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ చిత్రంలో చిన్న భరతుడి పాత్రలో అర్హ నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ చిన్న పాత్రలోనూ ఆమె ఎక్స్‌ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. అప్పటి నుండి అర్హకు ఒక ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఏర్పడింది.
ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో చేసే ప్రతి చిన్న అప్‌డేట్ క్షణాల్లోనే వైరల్ అవుతోంది. స్టైల్, ఎటిట్యూడ్, స్మార్ట్‌నెస్ – ఈ మూడింటి మిక్స్‌తో అర్హ ఇప్పటికే స్టార్ మెటీరియల్‌గా కనిపిస్తోంది. అభిమానులు అయితే “ఇంకో చిన్న ఐకాన్ స్టార్ వస్తోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అల్లు కుటుంబం హాలోవీన్ వేడుకలు మాత్రం ప్రతి ఏడాది ట్రెండ్ సెట్ చేసేలా మారాయి. ఈసారి అర్హ స్టైల్, అయాన్ హావభావాలు, స్నేహా క్యాప్షన్స్ – మొత్తం కలిసి సోషల్ మీడియాలో “స్టార్ ఫ్యామిలీ గోల్స్”ని రీఫైన్ చేశాయి.
అర్హ చిన్న వయస్సులోనే అంత హై లెవెల్ పాపులారిటీ సాధించడమే కాదు, తన స్టైల్, బ్యూటీ, అటిట్యూడ్‌తో అభిమానులను అలరిస్తూ ఉంది. అందుకే నెటిజన్లు ఇప్పుడు ఒక్కటే చెబుతున్నారు —“నాన్న నే మించిపోతుందే..! అర్హ నిజంగా ఫ్యూచర్ స్టార్!”.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి