రాశి ఖన్నా ఢిల్లీ భామ అయినప్పటికీ తెలుగు వాళ్ళు ఈమెను ఓన్ చేసుకున్నారు.అలా తెలుగమ్మాయిగా రాశి ఖన్నా సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గానే సిద్దు జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా అనే మూవీ ద్వారా మనల్ని పలకరించింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ వ్యక్తిని కౌగిలించుకున్న ఫోటో షేర్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది.. అయితే రీసెంట్ గా తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో రాశి ఖన్నా తన రిలేషన్ గురించి లవ్ లైఫ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. తాను ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో పడ్డానని, మొదట సినిమాల్లోకి రాకముందు ప్రేమలో పడితే, ఆ తర్వాత రెండోసారి సినిమాల్లోకి వచ్చాక ప్రేమలో పడ్డాను..

 కానీ ప్రస్తుతం నేను రిలేషన్ లో ఉన్నానో లేదో అనేది మాత్రం చెప్పలేను అంటూ అభిమానులని ఇరకాటంలో పెట్టేసింది.అయితే రాశి ఖన్నా రిలేషన్ లో ఉన్నానో లేదో చెప్పలేనని కన్ఫ్యూజన్ గా చెబుతుంది అంటే కచ్చితంగా లవ్ లో ఉన్నట్టే.. ఒకవేళ రిలేషన్ లో లేకపోతే ప్రస్తుతం సింగిల్ అని చెబుతుంది.కానీ ఏది చెప్పలేదు కాబట్టి రిలేషన్ లోనే ఉంది అని కొంతమంది అనుకున్నారు.అయితే తాజాగా ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా రాశి ఖన్నా ఓ వ్యక్తిని హగ్ చేసుకున్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.అయితే ఆ వ్యక్తి ఫోటోని రివీల్ చేయకపోయినప్పటికీ ఆ ఫోటో మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు ఆ ఫోటోకి క్యాప్షన్ గా "హగ్ చేసుకుంటే ఈ ప్రపంచం మరింత సున్నితంగా కనిపిస్తుంది" అని పెట్టింది.
దీంతో రాశి ఖన్నా హగ్ చేసుకుంది కచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ నే అని.. అందుకే అలాంటి పోస్ట్ పెట్టిందని.. ఒకవేళ తన ఫ్రెండ్ లేకపోతే వేరే వాళ్ళు అయితే ఫేస్ రివీల్ చేసేది కదా. ఫేస్ రివీల్ చేయకుండా పోస్ట్ పెట్టిందంటే కచ్చితంగా తన బాయ్ ఫ్రెండే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాశి ఖన్నా పెట్టిన ఈ పోస్ట్ మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేయడంతో పాటు రాశి ఖన్నా త్వరలోనే రిలేషన్ గురించి రివీల్ చేయబోతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి రాశి ఖన్నా హగ్ చేసుకుంది ఆమె బాయ్ ఫ్రెండా లేక వేరే ఎవరైనానా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: