మాస్ మహారాజా రవితేజ తాజాగా  నటించిన సినిమా ‘మాస్ జాతర’ . ఈ సినిమా కొద్ది సేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం వహించిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పించింది.‘ధమాకా’ భారీ విజయం తర్వాత రవితేజ మరియు శ్రీలీల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ కాంబినేషన్ మళ్లీ తెరపై ఎలా కనపడుతుందో చూడాలనే ఉత్సుకతతో అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు. సంగీతం..భీమ్స్ సిసిరోలియో అందించిన ట్యూన్స్ ఈసారి మాస్ బీట్‌లతో పాటు ఫ్యామిలీ టచ్ కూడా కలిపాయి. సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా, రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సినిమాలో రవితేజ లక్ష్మణ్ భేరి అనే రైల్వే పోలీస్ పాత్రలో కనిపించాడు. తనదైన స్టైల్, టైమింగ్, డైలాగ్ డెలివరీతో అభిమానులను మళ్లీ మాస్ మోడ్‌లో ముంచెత్తాడు. అడవివరం గ్రామానికి చెందిన తులసి (శ్రీలీల)తో లక్ష్మణ్ ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ లవ్ ట్రాక్‌లో అనూహ్యమైన ట్విస్టులు కథను రసవత్తరంగా మార్చాయి.


హీరో పెళ్లి ఆలస్యానికి కారణమైన తాతయ్య (రాజేంద్ర ప్రసాద్) పాత్ర సినిమాలో ముఖ్యమైనది. ఆయన పాత్ర చివర్లో చేసిన త్యాగం ప్రేక్షకుల మనసును తాకేలా తెరకెక్కింది. అయితే కొన్ని లాజికల్, భాషా తప్పిదాలు మాత్రం స్క్రీన్‌ప్లేలో కనబడుతున్నాయి. హీరోయిన్ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతుంటే, ఆమె తండ్రి మాత్రం సాధారణ తెలుగు మాట్లాడడం కొంత కన్ఫ్యూజన్ కలిగిస్తుంది. అలాగే విలన్ డైలాగ్స్‌లో మధ్య మధ్యలో రాయలసీమ యాస కలిసిపోవడం సినిమాకు కంటిన్యూయిటీ తగ్గించే అంశంగా మారింది. పాటల విషయానికి వస్తే, అవి కథా ప్రవాహంలో సహజంగా రాకపోవడం ప్రేక్షకులకు కొంత బోర్‌గా అనిపించేలా చేసింది. కొన్ని సీన్లు ముగిసిన వెంటనే “ఇప్పుడు పాట టైమ్” అన్నట్లుగా సాంగ్స్ చేర్చడంతో నారేషన్ స్లో అయింది.అయితే ఈ అన్ని లోపాల మధ్యన కూడా శ్రీలీల నటన, ఎనర్జీ, స్క్రీన్‌పై నాటీ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆమె తన పాత్రలో చిలిపితనం, మాస్ పంచ్, గ్రామీణ ఇన్నోసెన్స్ అన్నీ బాగా మిళితం చేసింది.



మొదట ఈ సినిమాలో శ్రీలీల స్థానంలో కీర్తి సురేష్ ని హీరోయిన్‌గా అనుకున్నారట! భాను భోగవరపు డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ కావడంతో, ఆమెకు కథ వినిపించినా — స్క్రిప్ట్ నచ్చక కీర్తి ఆ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించిందని సినీ వర్గాల సమాచారం. ఆ తర్వాత రవితేజ స్వయంగా శ్రీలీలను రికమెండ్ చేయడంతో, ఆమె ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందట.ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత, నెగిటివ్ టాక్ వచ్చినా కూడా శ్రీలీల పర్ఫార్మెన్స్ మాత్రం అందరి ప్రశంసలు అందుకుంది. రవితేజతో ఆమె కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా హైలైట్‌గా నిలిచాయి.మొత్తానికి ‘మాస్ జాతర’ మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్నా, రవితేజ-శ్రీలీల కాంబినేషన్ మరోసారి థియేటర్లలో సందడి సృష్టించింది. కీర్తి సురేష్ ఈ రోల్‌ని చేయకపోవడం వల్ల కొంత సేఫ్ జోన్ లోకి వెళ్లిన్నట్లు అనిపిస్తోందని కొంతమంది సినీ ప్రేమికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: