యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజాగా డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అవలీలగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి టాక్ ను తెచ్చుకుంది. కానీ ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు హిట్ స్టేటస్ ను అందుకోలేదు.

ఈ వీకెండ్ ముగిసాక ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు  రావడం కష్టం అని ఈ వీకెండ్ ముగిసే లోపే ఈ సినిమా గనుక మంచి కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4.97 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.23 కోట్లు , ఆంధ్ర లో 3.95 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 14 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.15 కోట్ల షేర్ ... 18 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఈ మూవీ.కి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 85 లక్షల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: